YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

లోకేష్ 2.0 ర‌హ‌స్యం ఏమిటీ

లోకేష్ 2.0 ర‌హ‌స్యం ఏమిటీ

హైద్రాబాద్,  సెప్టెంబ‌ర్ 11, 
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ ఇస్మార్ట్ అయ్యారు. చాలా బరువు తగ్గి స్మార్ట్‌గా అయ్యారు.. స్లిమ్ లుక్‌లో అదరగొడుతున్నారు. లోకేష్‌ను చూసి తెలుగు తమ్ముళ్లే అవాక్కయ్యారు.. చినబాబు బాగా బరువు తగ్గారే అని చర్చించుకున్నారట. మాజీ మంత్రి కొల్లు రవీంద్రను పరామర్శించడానికి లోకేష్ హైదరాబాద్ నుంచి వచ్చారు. చాలా రోజుల తర్వాత లోకేష్‌ను చూసి.. ఇంకా స్మార్ట్ అయ్యారని గుసగుసలాడుకున్నారట.ఏంటి లోకేష్ గారు ఇంత సన్నబడిపోయారని తెలుగు తమ్ముళ్లు, మీడియా ప్రతినిధులు ఆసక్తిగా అడిగారట. సీక్రెట్ ఏంటో చెప్పమని కోరారట.. లాక్ డౌన్ సమయంలో నైక్ ట్రైనింగ్ క్లబ్ (ఎన్‌టిసి) యాప్ సహకారంతో వర్కౌట్స్ చేశారట. దాదాపు 20 కిలోలకుపైగా బరువు తగ్గారట. ప్రతిరోజూ ఒక గంట పాటు వర్కౌట్స్, ఉడికించిన కూరగాయలు తిని బరువు తగ్గించినట్లు చెప్పారట. గత నాలుగైదు నెలల్లోనే చాలా మారిపోయారు లోకేష్.మహానాడు సమయంలో కూడా లోకేష్ మొదటిసారి స్లిమ్‌గా కనిపించారు. లోకేష్ 2.O అంటూ.. చాలా స‌న్న‌గా, స్లిమ్‌గా ఎలా మారారని అప్పుడూ ఆరా తీశారు. చాలా డైట్ కంట్రోల్ చేసి.. వర్కౌట్స్ చేశానని చెప్పుకొచ్చారట. అప్పుడు కూడా లోకేష్ స్లిమ్ లుక్‌పై సోషల్ మీడియాలో టీడీపీ కార్యకర్తలు చర్చించుకున్నారు. మా చోటా బాస్ స్లిమ్ లుక్ అంటూ ఫోటోలు షేర్ చేశారు. ఇప్పుడూ కూడా లోకేష్ లేటెస్ట్ లుక్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇంకా బాగా సన్నబడ్డారని చర్చించుకుంటున్నారు.

Related Posts