న్యూ ఢిల్లీ సెప్టెంబర్ 11
భారత్-చైనా మధ్య సరిహద్దుల్లో ఉద్రిక్తతలు హీట్ పెంచుతున్నాయి. యుద్ధం అనివార్యం అన్నట్టుగా పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇరుదేశాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. తాజాగా ఐదు అంశాల ప్రణాళిక ద్వారా సమస్యను పరిష్కరించుకోవడానికి అంగీకరించాయి. తాజాగా షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సు సందర్భంగా భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి గురువారం సాయంత్రం భేటి అయ్యారు. ఈ చర్చల సందర్భంగా ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని ఇరుదేశాల మంత్రులు నిర్ణయించారు. ఐదు అంశాల పట్ల అంగీకారం కుదిరినట్లు వెల్లడించింది.ఇరుదేశాల మధ్య సైనిక చర్చలు జరిగి బలగాల ఉపసంహరణ జరగాలి. ఇరు దేశాల సైన్యాల మధ్య దూరం పాటించాలి. ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని ఈ సమావేశంలో నిర్ణయించారని భారత విదేశాంగ శాఖ ప్రకటించింది.ఈ మేరకు వివాదాలు విభేదాలుగా మారకుండా చూసుకోవాలని ఇరుదేశాల సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా మోడీ జిన్ పింగ్ ల మధ్య జరిగిన నిర్ణయాలకు కట్టుబడి ఉండాలని నిర్ణయించారు