గుంటూరు సెప్టెంబర్ 11
ఈనెల 4 వ తేదీన వైసీపీ రాష్ట్ర కార్యాలయంలో మంత్రి కొడాలి నాని, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, గన్నవరం ఎమ్మెల్యే వంశీ మోహన్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి నాపై బెదిరింపులకు పాల్పడ్డారు. కొడాలి నాని రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారు. ఒక బాధ్యత గల మంత్రి అయిఉండి అసభ్యకరంగా మాట్లాతున్నాడని మాజీ మంత్రి దేవినేని ఉమా అన్నారు. నన్ను మా అధినేత చంద్రబాబును ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని హెచ్చరించి...లారితో యాక్సిడెంట్ చేసి చంపేస్తా అని బెదిరించారు. ఈ కుట్రలో సీఎం జగన్ కు భాగం ఉంది. సీఎం జగన్ మెప్పు పొందటానికే మాట్లాడుతున్నారు. అమరావతి రైతులు, దళితులని,న్యాయ విభాగంలో ఉన్నవారిని తిడితే కేసులు ఉండవు. రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తుంది. శాంతి భద్రతలు కాపాడాల్సిన పోలీసులే వైకాపా నాయకులకు వత్తాసు పలుకుతున్నారు. రాత్రి గుడివాడలో టీడీపీ నాయకులపై 20 మంది గుండాలు ఇంటిమీద పడి దాడిచేసై ఇప్పటివరకు చర్యలు లేవు. డీజీపీ సుమోటోగా తీసుకుని కేసులు నమోదు చేయాలి. గత ప్రభుత్వాలను విమర్శించాను నన్ను ఎవరు బెదిరించలేదు. నా 20 ఏళ్ల రాజకీయ జీవితంలో జగన్ ప్రభుత్వాన్నీ ప్రశ్నిస్తే రోజు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని అన్నారు. కృష్ణా జలాలు పులివెందులకు ఇచ్చినందుకె మాపై సీఎం జగన్ కు కోపం. ప్రశ్నిస్తే ఈ ప్రభుత్వానికి ఎందుకు కోపం వస్తుంది. నాకు ఉన్న సెక్యురిటీని కూడా తొలగించారు. ఇదంతా సీఎం జగన్ ప్రేరణతో, ప్రోత్సాహంతోనే జరుగుతుంది. రాష్ట్ర ప్రజలు అందరూ మీ అరాచకాలు గమనిస్తున్నారు...త్వరలోనే తగిన బుద్ధి చెప్తారని అయన అన్నారు.