YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఆలయాల భద్రతపై పోలీసుల అప్రమత్తం

ఆలయాల భద్రతపై పోలీసుల అప్రమత్తం

అమరావతి సెప్టెంబర్ 12 
రాష్ట్రం లోని అన్ని దేవాలయాలు, ప్రార్థన మందిరాల వద్ద పూర్తి స్థాయిలో భద్రత  ఉండే విధంగా నిర్వాహకులు పరిసర ప్రాంతాలు స్పష్టంగా కనిపించే విధంగా లైట్లు, సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంతో పాటు అగ్నిప్రమాద నియంత్రణ పరికరాలు, నిరంతరం పరివ్యేక్షించే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలని డీజిపి గౌతం సవాంగ్ సూచించారు.  అన్ని దేవాలయాలు, ప్రార్థన మందిరాలను జియో ట్యాగింగ్, నిరంతర నిఘా కొనసాగించే విధంగా ఎస్పీలను అయన అప్రమత్తం చేశారు. దేవాలయాలు, ప్రార్థన మందిరాల పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. రాష్ట్రం లోని దేవాలయాలు, ప్రార్థన మందిరాల వద్ద అన్ని భద్రత చర్యలను ఎప్పటికీ అప్పుడు పర్యవేక్షించాలని జిల్లా ఎస్పీ లను ఇప్పటికీ ఆదేశాలు జారీ చేశామని అయన అన్నారు. మతసామర్యానికి ప్రతీకైన ఆంధ్ర ప్రదేశ్ లో కొంతమంది ఆకతాయిలు ఉదేశపూర్వకంగా మతాల మధ్య చిచ్చు పెడుతూ శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. అట్టి వారి చర్యలను పోలీస్ శాఖ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపెక్షించదు. కఠిన  చర్యలు తీసుకుంటామని అయన అన్నారు.

Related Posts