YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఎమ్ముల్యే టిక్కెట్టే ముద్దు నా కొద్దు... పార్టీ అధ్యక్ష పదవి

ఎమ్ముల్యే టిక్కెట్టే ముద్దు నా కొద్దు... పార్టీ అధ్యక్ష పదవి

కేంద్రంతో పాటు రాష్ట్రంలో అధికారం చేపట్టేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం పెద్దఎత్తున సంస్కరణలకు శ్రీకారం చుట్టింది.  జిల్లా అధ్యక్షులుగా ఉన్న వారికి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేదని కాంగ్రెస్ అధిష్ఠానం ఇటీవల స్పష్టం చేసింది. ఎమ్మెల్యేలు, ఎంపీలుగా టిక్కెట్లు ఇచ్చే అవకాశాలు లేవని పేర్కొంది. ఈ నిర్ణయం పై డీసీసీ అధ్యక్షులు మండిపడుతున్నారు. పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు నిరంతరం కృషి చేస్తున్న తమను అధిష్ఠానం పట్టించుకోకపోవడంపై పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీ అధికారంలో ఉన్నా, లేకున్నా పార్టీ కోసమే పని చేసే తమను పక్కన పెట్టడం సరైన నిర్ణయం కాదని పలువురు వాపోతున్నారు. మంత్రులుగా ఐదేండ్లు పనిచేసి, బాగా సంపాదించి, ఎన్నికల్లో ఓటమి పాలైన వారికి టికెట్లెందుకని ఓ డీసీసీ అధ్యక్షుడు బహిరంగంగానే ఆరోపించారువచ్చే ఎన్నికల్లో విజయం సాధించి ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో అధికారం చేపట్టాలని టీపీసీసీ ఆధ్వర్యంలో ముఖ్యనేతలు రాష్ట్రంలో బస్సుయాత్ర కూడా చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ అధిష్ఠానం వ్యవహరిస్తున్న తీరుపై ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు మాత్రం గుర్రుగా ఉన్నారు. నేతల మధ్య విభేదాలు, గ్రూపుల పోరు కాంగ్రెస్‌లో సర్వ సాధారణం. కానీ డీసీసీ అధ్యక్షుని హోదాలో ఉన్నవారే పార్టీ తీరుపై తిరుగుబాటు చేసే విధంగా మాట్లాడుతుండటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.. ఉమ్మడి ఖమ్మం జిల్లా అధ్యక్షులు అయితా సత్యం ఇటీవల మరణించారు. మిగిలిన తొమ్మిది జిల్లాల్లోని డీసీసీ అధ్యక్షులు ఏండ్ల తరబడి పార్టీనే నమ్ముకుని పనిచేస్తున్నారని ఓ డీసీసీ అధ్యక్షుడు అభిప్రాయడప్డారు. డీసీసీ అధ్యక్షులుగా పనిచేస్తున్న వారిలో ఆశావాహులకు టికెట్లు ఇవ్వకపోతే పార్టీపై తిరుగుబాటు తప్పదని పలువురు నేతలు  పరోక్షంగా హెచ్చరిస్తున్నారు. పార్టీ అధికారంలో ఉన్న సమయంలో మంత్రులు కనీసం తమకు ప్రాధాన్యమివ్వరని, వారి కనుసన్నలలోనే పార్టీ నడవాలని, అలాంట ప్పుడు మేమెందుకని డీసీసీ అధ్యక్షులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోటం కూడా అన్యాయమంటున్నారు. పార్టీ అధికారంలోకి వస్తే నామినేటెడ్ పదవులు, ఎమ్మెల్సీ లాంటివైనా ఇస్తారా అనే స్పష్టత అధిష్ఠానం నుంచి లేకపోవటం పట్ల పలువురు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో అధిష్ఠానం నుంచి స్పష్టమైన హామీ రాకపోతే తాము చిత్తశుద్ధితో పనిచేయలేమని కొందరు డీసీసీ అధ్యక్షులు పేర్కొం టున్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్ ఎదుర్కొనేందుకు వ్యూహాలు పన్నుతున్న ఏఐసీసీ, టీపీసీసీ, డీసీసీ అధ్యక్షుల్లో అసంతృప్తి మరింతగా పెరగకముందే అధిష్ఠానం తగు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని పలువురు సీనియర్లు సూచిస్తున్నారు. ఏదిఏమైనా తమకు న్యాయం జరగకపోతే పార్టీని తమ భుజాలపై మోయలేమని డీసీసీ అధ్యక్షులు హెచ్చరిస్తున్నారు.

Related Posts