అమరావతి సెప్టెంబర్ 12
అంతర్వేది ఘటనలో ఎలాంటి అపోహలు ఉండకూడదనే సీబీఐకి అప్పగించాం. మా ప్రభుత్వంలో ఏదైనా పారదర్శకంగా జరుగుతుందని మంత్రి బోత్స సత్యనారాయణ అన్నారు. టీడీపీ పాలనలో ఎన్ని ఘటనలు జరిగినా సీబీఐ విచారణకు ధైర్యం చెయ్యలేదు. దమ్ము ధైర్యం చిత్తశుద్ధి ఉంది కనుకే మా ప్రభుత్వం సీబీఐ కు అప్పగించిందని అయన అన్నారు. రాష్ట్రంలోకి సీబీఐ రాకుండా జీవో ఇచ్చిన చరిత్ర చంద్రబాబుది. చంద్రబాబు హయాంలో దేవాలయాల విషయంలో ఎన్ని పాపాలు చేసాడో ప్రజలు చూసారు. ఐదేళ్లు ఒక్క మాట మాట్లాడని పవన్ ఇప్పుడు దీక్షలు చేస్తున్నాడు. రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడాల్సిన బాధ్యత వీళ్లకు లేదా ? ప్రతిపక్షాలు ప్రజల విషయంలో బాద్యతగా వ్యవహరించాలి. ధర్నాలు, ఆందోళనలు అంటూ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించే ఎలా అని అయన ప్రశ్నించారు. దేవుడికి రాజకీయాలకు ముడి పెట్టడం మంచిది కాదు. శాంతిభద్రతలకు ఆటంకం కలిగిస్తే ఎవరినైనా ఉపేక్షించేది లేదు. రఘురామ కృష్ణంరాజు చౌకబారు ఆరోపణలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆయన ముందు రాజీనామా చేసి మాట్లాడాలని అయన అన్నారు.