YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

బీటెక్ ఆన్సర్ ఫీట్లు మార్చేసిన కేటు గాళ్లు

బీటెక్ ఆన్సర్ ఫీట్లు మార్చేసిన కేటు గాళ్లు

రాజమండ్రి, సెప్టెంబర్ 12
బీటెక్ ఆన్సర్ షీట్‌లో గుండ్రటి హ్యాండ్ రైటింగ్.. అడిగిన అన్ని ప్రశ్నలకూ వంద శాతం సమాధానాలు.. అవి చూసి పేపర్ వాల్యుయేషన్ చేస్తున్న ఎగ్జామినర్‌కి అనుమానం  రావడంతో అసలు సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్స్‌ని పిలిపించారు. ఆ మూడు పేపర్లు చూసి వారు కూడా కంగుతిన్నారు. ఇంత కచ్చితత్వంతో ఎలా రాశారా అని అనుమానాలు తలెత్తాయి.  తీరా ఆ ఆన్సర్ షీట్లతో పాటు హాల్ టిక్కెట్లు కూడా ఉండడంతో అనుమానాలు బలపడి సదరు ముగ్గురు విద్యార్థులను పిలిపించి ప్రశ్నిస్తే షాకింగ్ నిజాలు వెలుగులోకి  వచ్చాయి. అసలు ఆన్సర్ షీట్ బదులు మరో ఆన్సర్ షీట్ జతచేసిన భారీ ఎగ్జామ్ రాకెట్టే బయటకు వచ్చింది. దీంతో  కాకినాడ జేఎన్‌టీయూ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.విజయనగరం జిల్లాలోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్న బీటెక్ విద్యార్థులకు శ్రీకాకుళంకి చెందిన  రామ్మోహన్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. రామ్మోహన్ గతంలో ఓ ఇంజనీరింగ్ కాలేజీ ఎగ్జామినేషన్ విభాగంలో పనిచేశాడు. గత నవంబర్‌లో జరిగిన మొదటి సెమిస్టర్  పరీక్షలు సరిగ్గా రాయలేదని విద్యార్థులు చెప్పడంతో రామ్మోహన్ వారికి బంపరాఫర్ ఇచ్చాడు. ఏకంగా మీ ఆన్సర్ షీట్లే మార్చేస్తానంటూ డీల్ కుదుర్చుకున్నాడు.  అనుకున్నట్లుగానే వైజాగ్ నుంచి ఆన్సర్ షీట్లు తీసుకెళ్తుండగా పేపర్లు మార్చేశాడు. విద్యార్థులు రాసిన పేపర్లు తీసేసి.. వాటి స్థానంలో వంద శాతం రాసి ఉంచిన ఆన్సర్ షీట్లు  పెట్టేశాడు.అయితే వాటితో పాటే పొరపాటున విద్యార్థుల హాల్ టిక్కెట్లు కూడా జతచేయడంతో అడ్డంగా దొరికిపోయారు. అందమైన హ్యాండ్ రైటింగ్, వంద శాతం జవాబులు రాసి  ఉండడం చూసి అనుమానం వచ్చిన ఎగ్జామినర్లు కంట్రోలర్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్స్‌ని పిలిపించి పరిశీలించడంతో అలా రాయడం దాదాపుగా అసాధ్యమని  చెప్పారు. దానికి తోడు హాల్ టిక్కెట్లు జత చేయడం కొత్త అనుమానాలకు తావిచ్చింది. గోల్‌మాల్ జరిగిందని గుర్తించిన వర్సిటీ ఎగ్జామినేషన్ సిబ్బంది ముగ్గురు విద్యార్థులను  పిలిపించి విచారించడంతో రామ్మోహన్ పాత్ర బయటపడింది.అతన్ని పిలిపించి ప్రశ్నించడంతో షాకింగ్ విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. విజయనగరం విద్యార్థులు  జంబ్లింగ్‌లో భాగంగా విశాఖ జిల్లాలో పరీక్షలు రాశారు. తాను ఎగ్జామినేషన్ విభాగంలో పనిచేసిన సమయంలో వర్సిటీలోని ఎగ్జామినేషన్ సెంటర్‌లో పనిచేస్తున్న కొందరు  ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులతో పరిచయాలయ్యాయి. వైజాగ్ నుంచి లారీల్లో పేపర్లు తరలించే సమయంలో ఔట్‌సోర్సింగ్ సిబ్బంది ద్వారా ముగ్గురు విద్యార్థుల ఆన్సర్ షీట్లు  తప్పించి.. వాటి స్థానంలో ఫుల్లుగా రాసి ఉంచిన ఆన్సర్ షీట్లు పెట్టేశారు. తీరా విషయం బయటపడడంతో వర్సిటీ అధికారులు కాకినాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు.  అక్రమాలకు పాల్పడిన ఔట్‌సోర్సింగ్ సిబ్బందిపై వేటు వేశారు

Related Posts