నిర్మల్ సెప్టెంబర్ 13,
ప్రేమించి పెళ్లి చేసుకొని కూతురు పుట్టిన తరువాత భర్త మొఖం చాటేసడని భార్య భైటాయించింది. తనకు న్యాయం చేయాలని భార్య నీలవేణి డిమాండ్ చేసింది. ఖమ్మం జిల్లా పర్ణశాలకు చెందిన నీలవేణి 2017 సంవత్సరం లో హైదరాబాద్ లో ల్యాబ్ టెక్నీషియన్ గా పని చేస్తున్న సమయంలో నిర్మల్ జిల్లా గాంధీ చౌక్ కు చెందిన విజయ్ అనే యువకుడి తో పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్త ప్రేమగా మారడం తో 2018 లో వీరిద్దరూ గుడిలో ప్రేమ వివాహం చేసుకున్నారు. తరువాత నీలవేణి పుట్టింటికి కాన్పు కోసం వెళ్లగా పాప జన్మించింది. నీలవేణి పుట్టింటికి వెళ్లిన సమయంలో విజయ్ మరో యువతిని వివాహం చేసుకున్నాడు. అనంతరం విడాకులు కావాలని వేధించడం ప్రారంభించడని నీలవేణి ఆరోపిస్తూ భర్త ఇంటి ముందు కూతురు తో బైఠాయించిది. గతం లో విజయ్ వేధింపుల పై దుమ్ముగూడెం పోలీసులకు సైతం పిర్యాదు చేసినట్లు బాధితురాలు తెలిపింది.