YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

నేర చరిత్ర ఉన్న నాయకులకి ఈసీ షాక్..

నేర చరిత్ర ఉన్న నాయకులకి ఈసీ షాక్..

న్యూ ఢిల్లీ సెప్టెంబర్ 13,
ప్రస్తుత రాజకీయాలు పూర్తిగా భ్రష్టు పట్టిపోయాయనేది దేశంలోని ప్రతి ఒక్కరిలో ఉన్న ఒక బలమైన అభిప్రాయమనడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు. గత కొన్నేళ్లుగా దాదాపు అన్ని పార్టీల నుంచి నేర చరిత్ర కలిగిన వ్యక్తులు ఎన్నికల్లో పోటీ చేస్తుండటం అంతకంతకూ పెరిగిపోతోంది. ఎన్నికల అఫిడవిట్లలో ఎంతో మంది నేతలు తమపై ఉన్న క్రిమినల్ కేసుల వివరాలను వెల్లడిస్తున్నారు. అయితే ఓటర్లకు కూడా మరో గత్యంతరం లేక వారినే ఎన్నుకోవాల్సిన దుస్థితి దాపురించింది. అయితే అందరూ అలాంటివారే లేరు. కానీ ఈ తరహా నేర చరిత్ర కలిగినవారు కొంతమంది అయితే ఉన్నారు. ఇదిలా ఉంటే ఎన్నికల కమిషన్ కీలక ఆదేశాలు జారీ  చేసింది. అభ్యర్థుల నేర చరిత్రను.. పార్టీలు అభ్యర్థులు తప్పనిసరిగాప్రచారం చేయాల్సిందేనని ఆదేశించింది. త్వరలోనే దేశవ్యాప్తంగా ఉపఎన్నికలు జరగబోతున్నాయి. బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశవ్యాప్తంగా 64 నియోజకవర్గాల్లో ఉపఎన్నికలు జరగనున్నాయి. అలాగే లోక్ సభ కి  కూడా కొన్ని చోట్ల ఉపఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.  ఈ నేపథ్యంలో ఈసీ కొత్త గైడ్ లైన్స్ జారీ చేసింది. మూడు విడతల్లో ప్రచారం చేయాలంటూనే ... కొన్ని నిబంధనలు విధించింది. నామినేషన్ ఉపసంహరణ తేదీ తర్వాత మొదటి నాలుగురోజులు తొలి విడత ప్రచారం చేయాలని గైడ్  లైన్స్ లో ప్రకటించింది.  ఇక రెండో విడత ప్రచారం 5 నుంచి 8 తేదీల మధ్య చివరి విడత ప్రచారాన్ని పోలింగ్ కు రెండురోజుల ముందు వెల్లడించాలని సూచించింది. పార్టీల వెబ్ సైట్లలోనూ అభ్యర్థులపై దాఖలైన కేసులు ఇతర వివరాలు ఉండాలని స్పష్టం చేసింది.
ఏకగ్రీవమయ్యే అభ్యర్థులను సాదారణంగా పార్టీలు నామినేట్ చేస్తాయి. వారికి ఉన్న నేర చరిత్రను ప్రచారం చేయాలని ఆదేశాల్లో స్పష్టం చేసింది ఈసీ. ఈ ప్రచార కార్యక్రమాల వల్ల ప్రజలకు.. అభ్యర్థికి సంబంధించిన పూర్తి సమాచారం దొరుకుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది. ఇవి తక్షణమే అమల్లోకి వస్తాయని తేల్చి చెప్పింది.  ఎన్నికలలో ఏ వ్యక్తినైనా ఎన్నుకోవడం అనే ప్రక్రియ కేవలం ఆ వ్యక్తి గొప్ప లక్షణాల ఆధారంగానే జరగాలని... పలానా వ్యక్తి అయితేనే గెలుస్తాడు అనే ధోరణితో జరగరాదని ఈసీ  వ్యాఖ్యానించింది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి నేర చరిత్ర ఓటర్లకు తెలవాలని... వారికి ఓటు వేయాలో వద్దో ఓటర్లే నిర్ణయించుకుంటారని చెప్పింది. గెలవడం ఒక్కటే రాజకీయ పార్టీల లక్ష్యం కారాదని సూచించింది. 2018లోనే ఈసీ.. అన్ని పార్టీలకు ఈ విషయంపై దిశానిర్దేశం చేసింది. 2020 ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు ఇదే విషయంపై పార్టీలకు కీలక  ఆదేశాలు జారీ చేసింది.

Related Posts