YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

బీజేపీ రాష్ట్ర కమిటీ రెడీ

బీజేపీ రాష్ట్ర  కమిటీ రెడీ

విజ‌య‌వాడ‌, సెప్టెంబ‌ర్ 14. 
ఆంధ్రప్రదేశ్ లో పార్టీ బలోపేతమే లక్ష్యంగా బీజేపీ రాష్ట్ర నూతన కమిటీ నియామకం జరిగింది. జనసేనతో కలిసి 2024నాటికి రాష్ట్రంలో అధికారమే లక్ష్యమని ఇప్పటికే ప్రకటించిన పార్టీ అందుకు అనుగుణంగా పార్టీ  రాష్ట్ర కార్యవర్గ నియామకం చేపట్టింది. కొత్తగా ప్రకటించిన కార్యవర్గంలో పది మంది ఉఫాధ్యక్షులు, ఐదుగురు ప్రధాన కార్యదర్శులు, పది మంది రాష్ట్ర మోర్చా అధ్యక్షులు, ఆరుగురు అధికార ప్రతినిథులు ఉన్నారు.  అన్ని సామాజిక వర్గాలకూ సమ ప్రాధాన్యత ఉండేలా నూతన కమిటీ నియామకం ఉందని చెప్పాలి. పార్టీ కోశాధికారిగా సత్యమూర్తిని నియమించింది. ఇక పార్టీలో సీనియర్లకు హోదా పెంచింది. పార్టీ ఉపాధ్యక్షులుగా రేలంగి శ్రీదేవి, కాకు విజయ లక్ష్మి, మాలతీ రాణి, నిమ్మక జయరాజు, పైడి వేణుగోపాల్, విష్ణుకుమార్ రాజు, ఆదినారాయణ రెడ్డి, రావెల కిషోర్ బాబు, సురేందర్ రెడ్డి, చంద్రమౌళి, ప్రధాన కార్యదర్శులుగా సీవీఎన్ మాధవ్, విష్ణు వర్థన్ రెడ్డి, లోకుల గాంధీ, సూర్యనారాయణ రాజు, ఎన్ మధుకర్ లను నియమించింది.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు గతంలోనూ సూచన ప్రాయంగా బీజేపీ రాష్ట్ర కమిటీని భారీగా కుదించి నిర్మాణాత్మక కార్యాచరణను సమర్థంగా చేపట్టగలిగే టీమ్ ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. అందుకు అనుగుణంగానే 40 మందితో కూడిన కమిటీని పార్టీ ప్రకటించింది. ఈ కమిటీలో రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ముద్ర స్పష్టంగా కనిపిస్తున్నది. పార్టీ విధేయులకే కమిటీలో స్థానం దక్కింది.
గత కమిటీలో అధికార ప్రతినిధుల సంఖ్య 30 ఉండగా ఇప్పుడు దానిని ఆరుకు కుదించారు. లక్ష్యాలను ఛేదించాలన్న ఏకైక అజెండాతో నూతన కమిటీ పని చేయాలని కొత్తగా నియమితులైన కమిటీ సభ్యులను అభినందిస్తూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చెప్పడంలోనే 2014 ఎన్నికలే లక్ష్యంగా కమిటీ కూర్పు జరిగిందన్నది అవగతమౌతుంది. విధేయత, సైద్ధాంతిక పరిపక్వత లక్ష్యంగా కమిటీ ఎంపిక జరిగింది.
అధికార వైకాపా, విపక్ష తెలుగుదేశం పార్టీలకు సమదూరం పాటిస్తూ ఈ రెండూ కాకుండా కలిసి వచ్చే పార్టీలతో కలిసి మందుకు వెళ్లాలన్న వ్యూహంతో బీజేపీ ఉన్నట్లుగా కమిటీ కూర్పును బట్టి అవగతమౌతుంది. రాష్ట్ర రాజధానికి సహకారం, ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్ వంటి అంశాల విషయంలో బీజేపీ తీరు పట్ల ఆంధ్రులు సహజంగానే ఒకింత ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆ అగ్రహాగ్నిని చల్లార్చ పార్టీ శ్రేణుల్లో సమరోత్సాహాన్ని నింపి రాష్ట్రంలో పార్టీ పటిష్టతే లక్ష్యంగా నూతన కమిటీ ఎంపిక జరిగింది. వీర్రాజు సారథ్యంలో బీజేపీ ఏపీలో పాగా వేయగలుగుతుందా అన్నది రానున్న రోజులే తేలుస్తాయి.

Related Posts