YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఊరికి కాల్వ త‌వ్వేశాడు

ఊరికి కాల్వ త‌వ్వేశాడు

పాట్నా, సెప్టెంబ‌ర్ 14. 
మనిషి అనుకుంటే సాధించలేనిది అంటూ లేదు.. ప్రభుత్వాలు, అధికారులు ఎటువంటి సహాయం చేయకపోయినా కాలువను తానే త్రవ్వాలని అనుకున్నాడు. కొండల మీద నుండి కింద పడుతున్న నీటిని ఒడిసి పట్టుకుని కాలువల ద్వారా తమ ఊరి చెరువును నింపాలని అనుకున్న ఆ వ్యక్తి అనుకున్నది సాధించాడు. అయితే ఈ పని పూర్తీ చేయడానికి అతడికి పట్టిన సమయం 30 సంవత్సరాలు. వర్షపు నీరు... తాను త్రవ్విన కాలువ ద్వారా చెరువులోకి చేరుతుంటే ఆయన తాను పడిన కష్టాన్నంతా మరచిపోయాడు.  ఒక్కడే.. ఒకే ఒక్కడు బీహార్ రాష్ట్రంలో ఈ అద్భుతాన్ని చేసి చూపించాడు. గయా లోని లాతువా లోని కోతిల్వాలా గ్రామానికి అతడు ఈ సాయం చేశాడు. ఇంతకూ ఆ వ్యక్తి పేరు చెప్పలేదు కదూ.. 'లౌన్గీ భుయాన్'.    'ఈ కాలువ త్రవ్వడానికి నాకు 30 సంవత్సరాలు పట్టింది. గత 30 సంవత్సరాలుగా నా పశువులను దగ్గరలో ఉన్న అడవులకు తీసుకుని వెళ్లి మేపే వాడిని. ఆ సమయంలో ఈ కాలువను త్రవ్వుతూ ఉండేవాడిని. ఈ పని చేస్తూ ఉన్నప్పుడు ఒక్కరు కూడా నాకు సహాయం చేయడానికి ముందుకు రాలేదు. గ్రామస్తులంతా పొట్టకూటి కోసం పట్నాలకు వెళ్లిపోయారు. నేను మాత్రం సొంత గ్రామంలోనే ఉండాలని నిర్ణయించుకున్నా' అని భుయాన్ మీడియాకు తెలిపాడు.
గయా జిల్లా హెడ్ క్వార్టర్స్ కు ఈ ప్రాంతం 80 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఇది కూడా ఒకటి. చుట్టూ అటవీప్రాంతం కావడంతో అధికారులు కూడా ఈ ప్రాంతాన్ని పెద్దగా పట్టించుకునే వాళ్లు కాదు. ఆ ప్రాంత వాసులు ఎక్కువగా వ్యవసాయం, పశు సంపద మీద ఆధారపడి జీవించేవారు. వర్షాకాలంలో అక్కడ ఉన్న కొండల మీద నుండి నీరు ధారాళంగా వచ్చేది. ఆ నీటిని తమ ఊరి వైపు మళ్లిస్తే కుంటలు, చెరువులు నిండుతాయి కదా అని భుయాన్ భావించాడు. అందుకోసమే 30 సంవత్సరాలు కష్టపడి 3 కిలోమీటర్ల కాలువను త్రవ్వుతూ వచ్చాడు. అతడు చేసిన పని వలన గ్రామస్థులందరూ తమ పంటపొలాలకు నీటిని మళ్లించుకునే అవకాశం ఉంటుంది. అతడు చేసిన గొప్ప పనిని పలువురు ప్రశంసిస్తూ ఉన్నారు

Related Posts