హైద్రాబాద్, సెప్టెంబర్ 14,
ముఖ్యమంత్రుల మేకప్ విషయంపై మన దగ్గర పెద్దగా ఎవరూ పట్టించుకోరు. కానీ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, తెలంగాణ రాష్ట్రాల్లో మాత్రం.. మీడియా ఓ కంట కనిపెడుతూనే ఉంటుంది. సహజంగా సీఎంల మేకప్‌కు పెద్దగా ప్రాధాన్యం లేదని అనుకుంటారు కానీ, తాజాగా ఓ జాతీయ మీడియా వెల్లడించిన కథనం మేరకు ముఖ్యమంత్రుల మేకప్ ఖర్చుపై సాధారణ ప్రజలు ఆసక్తి చూపుతారట. ఇక, ముఖ్య మంత్రుల మేకప్ గురించి అనేక కథనాలు ప్రచారంలో ఉన్నాయి.సీఎంలు తమ వయసు తాలూకు ముచ్చట్లను మొహంలో కనిపించకుండా.. శరీరంలోనూ వ్యక్తం కాకుండా జాగ్రత్తలు పాటిస్తారట. గతంలో తమిళనాడు సీఎంగా వ్యవహరించిన జయలలిత.. ఈ విషయంలో చాలా టాప్‌లో ఉండేవారని ఈ మీడియా కథనం పేర్కొంది. ఇక, మాజీ ప్రధాని ఇందిర తర్వాత ఆ తరహాలో మేకప్‌కు ప్రాధాన్యం ఇచ్చిన నాయకురాలే లేరని కూడా ఈ మీడియా వివరించింది. ఇక, ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా రాష్ట్రాన్ని పాలిస్తున్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఒక్కరే.. మేకప్‌కు దూరంగా ఉండే సీఎం అని ఈ మీడియా తేల్చేసింది.ఇక, రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల విషయానికి వస్తే.. వీరు కూడా కోట్లలోనే ఖర్చు పెడుతున్నారని జాతీయ మీడియా వెల్లడించింది. తెలంగాణ సీఎం కేసీఆర్.. తలకట్టుకు ఉండే ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. ఇది ఆయనకు ప్రత్యేక పేరు తెచ్చింది. అదేవిధంగా ఆయన వేసుకునే దుస్తులు, భుజాలకు కట్టుకునే ఒకరకమైన వస్త్రం… మెడలో వేసుకునే కండువా.. నుంచి చెప్పుల వరకు కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటారని, ఇదేదో.. సాధారణంగా జరిగే ప్రక్రియ కాదని, మేకప్ కోసం.. ప్రత్యేకంగా గతంలోనే ఓ అధికారిని నియమించుకున్నారని కూడా పేర్కొంది.ఇక, ఏపీ విషయానికి వస్తే.. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు మేకప్‌కు చాలానే ఖర్చు చేసేవారని ఓ వర్గం మీడియా పేర్కొనేది. ధరించే దుస్తుల నుంచి ఆయన తీసుకున్న జాగ్రత్తలపై అనేక కథనాలు వచ్చాయి. ముఖ్యంగా తాను యువతకు పోటీ వచ్చే నాయకుడినే తప్ప.. వయసు మీద పడలేదని చెప్పుకొనేందుకు బాబు ప్రయత్నించారు. దీనికి కారణం.. అటు జగన్, ఇటు పవన్ ఇద్దరూ యువ నేతలే కాబట్టి. ఈ క్రమంలోనే మేకప్‌కు చాలా చాలా ఇంపార్టెంట్ ఇచ్చారు.ఇక, ఇప్పుడు జగన్… బాబును మించిపోయిన రేంజ్‌లో మేకప్‌కు ప్రాధాన్యం ఇస్తున్నారు. పైకి ఎలాంటి మేకప్ లేనట్టుగా ఉంటున్నా.. ఇది కూడా ఓ మేకప్పేనని జాతీయ మీడియా పేర్కొంది. ఆయన ధరించే ఒకే తరహా వస్త్రాలు, ఒకే తరహా చెప్పులతో పాటు.. ఆయన ప్రజలను ముఖ్యంగా మహిళా ఓటర్లను ఆకర్షించేలా ముఖకవళికల విషయంలో తీసుకునే జాగ్రత్తలు చాలానే ఉన్నాయని పేర్కొంది. పత్రికా ప్రకటనల్లో ఇచ్చే ఫొటోల ఫోజులను చూస్తే.. ఈ విషయం స్పష్టంగా తెలుస్తుందని కూడా ఈ మీడియా పేర్కొనడం గమనార్హం. మొత్తంగా చూస్తే.. ఈ మేకప్ ఖర్చు కోట్లలోనే ఉంటుందని అంటున్నారు. ఇదీ… ముఖ్యమంత్రుల మేకప్ కథ!