హైద్రాబాద్, సెప్టెంబర్ 14,
రాచకొండ కమిషనరేట్ పరిధిలో పోకిరీల గుండెల్లో షీ బృందాలు గుబులు రేపుతున్నాయి. అయినా అక్క డక్కడా పోకిరీలు, ఆకతాయిలు రెచ్చిపోతూనే ఉన్నారు. స్నేహితురాలి ఇంటికి వెళ్లివస్తున్న 19 ఏండ్లపై యువతని కిడ్నాప్ చేసిన ముగ్గురు యువకులు అమ్మాయిపై లైంగిక దాడికి పాల్పడ్డారు. మరో సంఘనటలో పెండ్లీపేరుతో టీచర్‌ను నమ్మించి లోబర్చుకున్న పీటీ పెండ్లి చేసుకునేందుకు నిరాకరించాడు. జస్ట్‌డయాలో ఫోన్ నెంబర్‌ను సంపా దించిన ఓ పోకిరీ అడ్వాకేట్‌ను వేధింపులకు గురిచేశాడు. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగుతున్న షీ బృందాలు పోకిరీలను సాక్ష్యాధారాలతో అదుపులోకి తీసుకుం టున్నాయి. మరికొన్ని షీ బృందాలు రద్దీప్రాంతాలు, బస్టాడ్స్, మార్కెట్‌తోపాటు వివిధ ప్రాంతాలల్లో ప్రత్యేక నిఘా వేసి డెకారు ఆపరేషన్‌తో పోకిరీల ఆగడాలకు అడ్డుకట్ట వేస్తున్నారు. బోనగిరి, ఈసీఐఎల్, సింగిచెర్ల తదితర ప్రాంతాల్లో డెకారు ఆపరేషన్ నిర్వహించిన షీ బృందాలు పోకిరీలను అరెస్టు చేశారు.కేవలం ఆరు నెలల కాలంలోనే 140 కేసులను నమోదు చేసిన షీ బృందాలు 117 మందిని అరెస్టు చేశా యి. అరెస్టైన వారిలో 105 మంది మేజర్లుండగా, 12 మంది మైనర్లున్నారు. 90 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసిన పోలీసులు 44 పెట్టీ కేసులను పెట్టారు. మరో ఆరుగురికి కౌన్సిలింగ్ ఇచ్చారు. అరెస్టు చేసిన వారి తల్లిదండ్రులను ఎల్‌బీనగర్‌లోని సీపీ క్యాప్ కార్యాలయానికి పిలిపించారు. తల్లిదండ్రుల సమక్షంలో పిల్లలకు (ఎన్‌జీవో) 'భూమికా ఉమెన్స్' సంస్థకు చెందిన నిపుణులతో కౌన్సిలింగ్ అందించారు.బీరప్పగూడకు చెందిన మలోత్ రామారావు జాదవ్ నాచారంలోని ఓ ప్రయివేట్ స్కూల్‌ల్లో పీటీ టీచర్‌గా పనిచే స్తున్నాడు. అదే స్కూల్లో పనిచేస్తున్న టీచర్‌తో స్నేహంగా ఉండేవాడు. చనువు పెంచుకున్న జాదవ్ ఆమెను ప్రేమి స్తున్నట్టు వెంటపడ్డాడు. పెండ్లీ చేసుకుంటానని నమ్మిం చాడు. పూర్తిగా నమ్మించిన జాదవ్ ఆమెను రూంకు తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. పెండ్లీ చేసుకోమని బాధితురాలు ఎన్నిసార్లు అడిగినా పట్టించుకోవడం మానే శాడు. చివరకు మోసపోయినట్టు గుర్తించిన బాధితురాలు షీ బృందాలను ఆశ్రయించిందిస్నేహితురాలిని కలిసేందుకని వెళ్లిన 19ఏండ్ల యువ తిని కిడ్నాప్ చేసిన ముగ్గురు యువకులు దారుణానికి ఒడి గట్టారు. బాలాపూర్‌కు చెందిన ఎస్.సురేష్, ఏ.నితీష్‌లు ఆటోలో వెళ్తున్న యువతిని గమనించి అదే ఆటోలో ఎక్కారు. అసభ్యకరంగా ప్రవర్తించారు. ఇదిలావుండగా ద్విచక్రవాహనంపై ఆటోను వెంబడిస్తున్న వీరి స్నేహి తుడు(మైనర్ బాలుడు) అమ్మాయిని బలవంతంగా ద్విచక్రవాహనంపై ఎక్కించుకుని నిర్మాణుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ అమ్మాయికి బలవంతంగా మద్యాన్ని తాగించిన ముగ్గురు నిందితులు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదుతో ఆదిభట్ల పోలీస ్‌స్టేషన్‌లో ముగ్గురిపై కేసు నమోదైంది.అచ్చంపేట్‌కు చెందిన ఎం.దుర్గా ప్రసాద్ అనే యువ కుడు ప్రయివేట్ సంస్థలో పనిచేస్తున్నాడు. జస్ట్ డయాలో ఓ అడ్వకేట్ ఫోన్ నెంబర్‌ను సంపాదించాడు. కేసు విషయం మాట్లాడాలని చెప్పాడు. కొన్నాళ్ల తర్వాత అడ్వ కేట్ వాట్సాప్‌కు అసభ్యకరమైన వీడియోలు, మెసేజ్‌లు పంపించడం మొదలు పెట్టాడు. బాధితురాలి ఫిర్యాదుతో సైబర్‌క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు.బోనగిరిలో ఓ మైనర్ బాలికపై కన్నేసిన ఓ మైనర్ బాలుడు ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు. ఆమె తిరస్క రించడంతో ఇంటర్‌మీడియం చదువుతున్న బాలుడు కక్షపెంచుకున్నాడు. అదునుకోసం వేచిచూస్తున్న నిందితుడు గత నెల 9న ఇంటి నుంచి బయటకు వచ్చిన బాలికను అడ్డుకుని నిన్ను చంపి, నేనూ ఆత్మహత్య చేసు కుంటానని బెదిరించాడు. ఆందోళనకు గురైన బాలికి తలిదండ్రుల సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది.రాచకొండ పరిధిల్లో బాల్య వివాహాలను పోలీసులు అడ్డుకుంటున్నారు. వారికి మంచి భవిష్యత్ ఇవ్వాలని పిల్లల తల్లిదండ్రులకు సీపీ ఆదేశాలతో పోలీస్ అధికారులు కౌన్సిలింగ్ ఇస్తున్నారు. అయినా గుట్టుచప్పుడు కాకుండా మైనర్లకు పెండ్లీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదే తరహాలో చౌటుప్పట్, బోనగిరి, ఇబ్రాహీంపట్నం, కుషా గూడా, వనస్థల్లిపురం తదితర ప్రాంతాల్లో రహస్యంగా పెండ్లీలు జరుగుతున్నట్టు షీ బృందాలకు సమాచారం రావడంతో 8 పెండ్లీలను అడ్డుకున్నారు. బాలబాలికల తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ అందించారు