YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

*ఏపీ కోవిడ్-19 కమాండ్ కంట్రోల్ రూమ్*

*ఏపీ కోవిడ్-19 కమాండ్ కంట్రోల్ రూమ్*

*కోవిడ్-19 నుంచి కోలుకున్నా తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ కేంద్ర ప్రభుత్వం తాజా మార్గదర్శకాలు:*
దేశ వ్యాప్తంగా కోవిడ్-19 కేసులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు 47లక్షల మందికి పైగా కోవిడ్ బారినపడ్డారు. 
37లక్షల మంది కోవిడ్ నుంచి కోలుకోగా మరో 9.50లక్షల ఆక్టివ్ కేసులు ఉన్నట్టు కేంద్ర వైద్య, ఆరోగ్య వెల్లడించింది.
ఈ నేపథ్యంలో కోవిడ్ బారినపడి కోలుకుంటున్న వారు కూడా అనేక రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది.
కొవిడ్-19‌ నుంచి కోలుకున్నప్పటికీ కొన్ని రోజులపాటు ఒంటి నొప్పులు, దగ్గు, జలుబు, శ్వాస సంబంధిత సమస్యలు, నీరసంగా ఉండడం వంటి లక్షణాలు కనపడతాయని తెలిపింది.
ఈ నేపథ్యంలోనే కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (EMR డివిజన్) *కోవిడ్ బారినుంచి కోలుకున్నవారు కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?* అనే అంశాలతోపాటు రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి అవసరమైన సూచనలు చేస్తూ మార్గదర్శకాలను విడుదల చేసింది.
*కోవిడ్ బారినుంచి కోలుకున్న తర్వాత పాటించాల్సిన ప్రొటోకాల్:*
*(i) వ్యక్తిగతంగా:*
* కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత కూడా మాస్కు ధరించడం, చేతులను తరచూ శుభ్రం చేసుకోవడం, శ్వాసకోస జాగ్రత్తలు, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి.
* తగినంత మేరకు వేడి నీళ్లు తాగుతూ ఉండాలి 
* రోగనిరోధ శక్తిని పెంచుకునేందుకు ఆయుష్ మంత్రిత్వశాఖ సూచించిన మందులను వాడండి. ఆయుష్ డాక్టర్ ఇచ్చిన మందులు మాత్రమే ఉపయోగించండి.
* మీ ఆరోగ్యం సహకరిస్తే ఇంట్లో రోజువారీ పనులను చేసుకోండి. వృత్తిపరమైన పనులను కూడా క్రమపద్దతిలో ప్రారంభించవచ్చు.
*ii) తేలికపాటి/ మితమైన వ్యాయామాలు:*
      * శరీరం సహకరించిన మేరకు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, యోగాసనాలను వేయడం, ప్రాణాయామం చేయడం వంటి చర్యలను రోజూ చేయాల్సి ఉంటుంది.
      * చికిత్స చేసే వైద్యులు సూచించిన విధంగా శ్వాసకు సంబంధించిన వ్యాయామాలు చేయాలి.
      * మీకు సౌకర్యంగా ఉండే చోట ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం నడవడం అలవాటు చేసుకోండి.
*  సమతుల్యమైన పోషకాహారం, తాజాగా వండిన, సులువుగా జీర్ణమయ్యే ఆహారాలను తీసుకోవాలి.
* తగినంత నిద్ర మరియు విశ్రాంతి తీసుకోవాలి.
* పొగతాగడం, మద్యం సేవించడాన్ని మానేయండి.
* కోవిడ్ చికిత్స సమయంలో సూచించిన మందులను క్రమం తప్పకుండా వాడాలి. ఒకవేళ ఏమైనా శ్వాసకోస సంబంధమైన ఇబ్బందులు ఉంటే వెంటనే మీకు తెలిసిన వైద్యులను సంప్రదించాలి. వ్యక్తిగతంగా ఏమైనా మందులు వాడుతున్నట్టయితే వైద్యులకు తెలియజేయాలి. వారు సూచించిన మందులను వాడాలి.
* ఇంట్లోనే ఉంటూ శరీర ఉష్ణోగ్రతను తరచూ పరీక్షించుకోవాలి. రక్తపోటు, మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకోవాలి. ఆక్సోమీటర్ తో ఆక్సిజన్ లెవల్స్ ను తెలసుకుంటూ ఉండాలి.
* పొడి దగ్గు / గొంతు నొప్పి ఉంటే, సెలైన్ గార్గల్స్ లేదా ఆవిరి పట్టడం చేసుకోండి. 
* కోవిడ్ ముందస్తు లక్షణాలైన తీవ్రమైన జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఆక్సిజన్ లెవెల్స్ 95శాతం కంటే తక్కువగా ఉండడం, ఛాతిలో నొప్పి, శరీరం బలహీనంగా మారడం, గందరగోళ పరిస్థితులు వంటివి
*ii) కమ్యునిటీ స్థాయిలో:*
* కోవిడ్ నుంచి కోలుకున్నవారు ఆ సమయంలో ఎదుర్కొన్న పరిస్థితులను సోషల్ మీడియా ద్వారా గానీ, సంఘాలని గానీ, నాయకుల ద్వారా గానీ, కుల సంఘాల పెద్దల ద్వారా తమ స్నేహితులు, బంధువులతో పంచుకోవడం ద్వారా కోవిడ్ పై అవగాహన, వైరస్ పై ఉన్న వదంతులు తొలగించవచ్చు.
* స్వయం సహాయక సంఘాల ప్రతినిధులు, పౌరసమాజం, పలువురు నిపుణులతో పునరావాస చర్యలు చేపట్టండి (వైద్య, సామాజిక, వృత్తిపరమైన, జీవనోపాధి)
* సహచరులు, ఆరోగ్య కార్యకర్తల నుంచి సామాజిక మద్దతు కోరండి. అవసరమైతే మానసిక ఆరోగ్యసాయం తీసుకోండి.
* పలు సంస్థలు, గ్రూపులు నిర్వహించే యోగా, ధ్యానం లాంటి సమూహ సమావేశాల్లో తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటూ భౌతిక దూరం పాటిస్తూ పాల్గొనండి.
*(iii) ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవడం:*
* కోవిడ్ నుంచి కోలుకున్న వ్యక్తికి భౌతికంగాను లేదా ఫోన్ ద్వారా 7 రోజుల్లోపు సంప్రదించాలి. వీలైనంత వరకు అతను చికిత్స పొందిన ఆస్పత్రిలో అయితే మంచిది.
* దగ్గరలో ఉన్న గుర్తింపు పొందిన అల్లోపతి లేదా ఆయుష్ ప్రాక్టీషనర్, మెడికల్ ఫెసిలిటీలు ఉన్న వారు తరచూ వారిని పరీక్షించడం, ఫాలో అప్ చేస్తూ ఉండాలి. పాలిథెరపీని వీలైనంత వరకు నివారించాలి.
* ఒకవేళ హోమ్ ఐసోలేషన్ లో ఉంటున్నవారైతే ఏవైనా కోవిడ్ లక్షణాలున్నట్టు గుర్తిస్తే వెంటనే వైద్యులకు గానీ, స్థానికంగా ఉండే ఆస్పత్రికి గానీ వెళ్లాలి.
* క్లిష్టమైన, తీవ్రమైన కేసులకు సంబంధించి మరింత జాగ్రత్తలు తీసుకుంటూ సరైన విధంగా ఫాలోఅప్  పొందండి
*రోగ నిరోధకశక్తిని పెంచుకునేందుకు ఆయుష్ మందులను (నిర్ధిష్ట స్ట్రీమ్ కింద గుర్తింపు పొందిన ప్రాక్టీషనర్స్ సూచించినవి మాత్రమే)*
* *ఆయుష్ క్వాత్* (150 మిల్లీలీటర్లు లేదా ఒక కప్పు) ప్రతిరోజు తీసుకోవాలి.
* 500 మిల్లీ గ్రాముల *శంషామని వటీ* లేదా మూడు గ్రాముల *గిలోయ్ పౌడర్‌* ను 15 రోజులపాటు వేడినీటిలో రోజూ రెండుపూటలు తీసుకోవాలి.
* అశ్వగంధ 500 మిల్లి గ్రాములు రోజుకు రెండుసార్లు ( ఒక గ్రాము చొప్పున ప్రతి రోజూ) తీసుకోవాలి. లేదా *అశ్వగంధ పౌడర్* 1-3 గ్రాములు రెండుసార్లు ప్రతిరోజు అలా 15 రోజులు వాడాలి.
* రోజుకు ఒకసారైనా ఒక *ఊసిరికాయ* లేదా 1-3 గ్రాముల మేర ఊసిరికాయ పౌడర్‌ను తీసుకోవాలి.
* పొడి దగ్గు ఉన్నట్టయితే *ములేతి పౌడర్‌* ను 1-3 గ్రాముల మేర వేడినీటిలో కలిపి తీసుకోవాలి.
* వేడి నీటిలో అర టీస్పూన్ *పసుపు* వేసుకుని ఉదయం, సాయంత్రం తాగాలి.
* పసుపు మరియు ఉప్పుతో పుక్కిలించాలి.
* ఒక టీ స్పూన్ *చ్యవన్‌ప్రాశ్‌* ను ప్రతిరోజూ ఉదయం తినాలని సూచించింది.
* అంతేకాకుండా *ఆయుష్ మంత్రిత్వ శాఖ* కూడా ఒక టీస్పూన్ చ్యవన్‌ప్రాశ్‌ ను ఉదయం వేడి నీటిలో లేదా పాలతో తాగవచ్చని సిఫార్సు చేసింది.
చ్యవన్‌ప్రాశ్‌ అనేది కోవిడ్ నుంచి *రికవరీ అనంతర కాలంలో ప్రభావవంతంగా* ఉంటుందని గుర్తించారు.
*కో విడ్  నుండి కోలుకున్నా కూడా మరింత జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వం వారు సూచిస్తున్నారు*
*డాక్టర్ అర్జా శ్రీకాంత్*
*స్టేట్ నోడల్ ఆఫీసర్, కోవిడ్-19*

Related Posts