విశాఖపట్నం సెప్టెంబర్ 14,
విశాఖ ఏజెన్సీ పాడేరు,మండల పరిధిలో వంజంగి,,కొండ పై మనసుదోచే మంచు సోయగా అందాలు తలిపిస్తుంది.ఈ ప్రాతంలో ఎక్కడికక్కడ పొగమంచు కమ్మేసి పాల సముద్రన్నీ తలిపిస్తుంది. ఆంధ్ర కాశ్మీర్ గా పేరుపొందిన పాడేరు,అరకు మంచు అందాలు ప్రకృతి ప్రేమికులను మైమరపిస్తున్నాయి. సీత కాలనికి ముందే ఈ సోయగాలు కనువిందు చేస్తుండడం తో కొంతమంది ఈ అందాలను ఆస్వాదించేందుకు తరలివస్తున్నారు.ఎత్తయిన కొండల్లో గుట్టలో నుండి చూస్తే మంచు పై మెగాల్లో తెలి ఆడుతున్నట్లు ఉంటుంది.అరకు, పాడేరు ప్రాంతాల్లోనూ మెగాల్లో, మంచు తెరలతో కొత్త అందాలు సంతరించుకుంటున్నాయి.గిలిగింతలు పెట్టే చలి గాలులు విశాఖ ఏజెన్సీ పాడేరు,లో వణికిస్తున్నాయి. పర్యాటకులకు రారమ్మని ఆహ్వానం పలుకుతూ మన్యం అందాలు స్వాగతం పలుకుతున్నాయి. ప్రకృతి రమణీయతకు అద్దం పట్టే విశాఖ మన్యంలో ఆకుల నుంచి జాలువారుతున్న మంచు-బిందువులు ప్రకృతి సొగసును మరింత ఇనుమడింప చేస్తున్నాయి. ఇవన్నీ విశాఖ జిల్లా మన్యం లో,పర్యాటకులను కనువిందు చేస్తున్నాయి. దేశంలో కాశ్మీర్ వంటి శీతల ప్రాంతాల్లో తరువాత ఆంధ్ర లో అత్యంత కనిష్టంగా నమోదవుతున్న అతి శీతల ప్రాంతంగా ప్రసిద్ధి చెందిన అరకు,పాడేరు,లంబ సింగి లో చలి తీవ్రత రెట్టింపవుతుంది. ఉదయిస్తున్న సూర్యుడు మారం చేస్తుంటే రహదారి వెంటన పొగమంచు వస్తున్న వాహనాలను కూడా గుర్తించలేని స్థాయిలో పొగమంచు దట్టంగా కురుస్తుంది. ప్రతియేటా వస్తున్న యాత్రికులకు ఈ అందాలను ఆస్వాదిస్తూ మధురాను భూతిని పొందుతున్నారు.ఈ ఏడాది కోవిడ్.19కరోనా మహమ్మారి వాళ్ళ పర్యాటక ప్రదేశాలు బోసిపోయాయి. మన్యం లో ఉన్న పర్యాటక ప్రదేశాల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధి చేసి గిరిజనుల కు ఉపాది అవకాశాలు పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.