YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

డిజాస్టర్ బిల్లుకు సభ అమోదం

డిజాస్టర్ బిల్లుకు సభ అమోదం

హైదరాబాద్ సెప్టెంబర్ 14 
శాసన సభలో తెలంగాణ డిజాస్టర్ అండ్ పబ్లిక్ హెల్త్ ఎమర్జన్సీ బిల్ – 2020 ను ఆర్థిక మంత్రి హరీశ్ రావు ప్రవేశపెట్టారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ కొవిడ్, లాక్ డౌన్ నేపధ్యంలో  రాష్ట్ర  ఆర్థిక పరిస్థితిని బట్టి ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల కోత విధిస్తూ ఆర్ఢినెన్స్ తెచ్చుకున్నాం. దాన్ని ఇప్పుడు చట్టంగా మార్చేందుకు సభ మందుకు తెస్తున్నాం.   ఏ ప్రిల్ నెలలో రాష్ట్ర సొంత  ఆదాయం 577 కోట్లు మాత్రమే రావడం జరిగింది.  ప్రజాప్రతినిధులు , ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు, పెన్షన్  చెల్లింపులు పోస్ట్ పోన్ చేశాం. రాబోయే రోజుల్లో చెల్లంచాలన్న ఉద్దేశంతో  ఈ  ఆర్డినెన్స్ తెచ్చుకోవడం జరిగిందని అన్నారు.  ప్రజాప్రతినిధుల వేతనాల్లో 75 శాతం, అఖిల భారత సర్వీసు ఉద్యోగుల వేతనాల్లో 60 శాతం, ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో 50 శాతం చెల్లింపులు పోస్ట్ పోన్ చేశాం.  బడ్జెట్ లో పెట్టుకున్న ఐదు నెలల 75 వేల 125 కోట్లు రావాల్సి ఉంటే 49 వేల 131 కోట్లు మాత్రమే రావడం జరిగింది. స్టేట్ ఓన్ రెవెన్యూ  7 వేల 850 కోట్లు రూపాయలు కరోనా నేపధ్యంలో తగ్గింది. సభ లేకపోవడం వల్ల ఆ సమయంలో  ఆర్డినెన్స్ తెచ్చుకున్నాం.  ఎప్పటిలోగా  వేతనాలు ఇచ్చేది సీఎంగారి పరిశీలనలో ఉంది.  అతి త్వరలోనే ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకుంటుందని అన్నారు.  ఈ బిల్లుకు ఎంఐఎం, కాంగ్రెస్ సభ్యులు సంపూర్ణ మద్ధతు ప్రకటించారు.  ఏకగ్రీవంగా బిల్లుకు  సభలో ఆమోదం లభించింది

Related Posts