న్యూ ఢిల్లీ సెప్టెంబర్ 14
చైనాతో సరిహద్దు వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. తాజాగా ఆ దేశం భారత్‌పై నిఘా పెట్టినట్లు తేలింది. సుమారు పది వేల మంది భారతీయలు, సంస్థలను డ్రాగన్ దేశం టార్గెట్ చేసినట్లు ఓ ఆంగ్ల పత్రిక కథనం రాసింది. చైనా కమ్యూనిస్టు పార్టీతో లింకున్న షెంజన్‌కు చెందిన ఓ టెక్నాలజీ సంస్థ .. భారతీయ వీఐపీలపై నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. ప్రధాని మోదీ, సోనియా గాంధీ, కేంద్ర మంత్రులతో పాటు త్రివిధ దళాలకు చెందిన అధిపతులను చైనా నిఘా పెట్టినట్లు ఆ కథనంలో పేర్కొన్నారు. చైనా కంపెనీలు డేటా చౌర్యానికి పాల్పడుతున్న విషయం తమకు తెలుసు అని కేంద్ర ప్రభుత్వ అధికారులు చెప్పారు. సమాచారాన్ని ఇలా దుర్వినియోగం చేస్తున్నారనే చైనా యాప్‌లను బహిష్కరించాల్సి వచ్చిందని సదురు అధికారులు చెబుతున్నారు. తమకు తెలియకుండానే భారత్‌కు చెందిన సాధారణ కస్టమర్ల సమాచారాన్ని చైనా కంపెనీలు మైనింగ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. చైనా కంపెనీలు తమ వద్ద ఉన్న డేటాను.. ఆ దేశ కమ్యూనిస్టు పార్టీకి చేరవేస్తున్నట్లు తెలిసింది.