YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

పోలీస్ వ్యవస్థపై హైకోర్టు సీరియస్

పోలీస్ వ్యవస్థపై హైకోర్టు సీరియస్

హైద్రాబాద్, సెప్టెంబర్ 14
ఏపీ డీజీపీ, పోలీస్ వ్యవస్థపై హైకోర్టు సీరియస్ కామెంట్స్ చేసింది. ఏపీలో పోలీస్ వ్యవస్ద గాడి తప్పుతుందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీలో ‘రూల్ ఆప్ లా’ అమలు కావడం లేదని మండిపడింది. గతంలో డీజీపీని పలుసార్లు కోర్టుకు పిలిపించిన మార్పు రాలేదని.. పోలీసు వ్యవస్థను కంట్రోల్ చేయలేకపోతే డీజీపీ రాజీనామా చేయాలని హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది.తూర్పుగోదావరి జిల్లా అమలాపురం మండలం ఇందుపల్లిలో వెంకటరాజు అదృశ్యంపై హైకోర్టులో హెబియస్ కార్పస్ దాఖలు చేశారు. వెంకటరాజు విషయంలో పోలీసుల తీరును హైకోర్టు తప్పుబట్టింది. గతంలో మూడు కేసుల్లో జుడిషియల్ విచారణ చేస్తే పోలీసులదే తప్పని తేలిందని.. ప్రతిసారి ఇలాంటి పరిస్థితే వస్తే ప్రభుత్వానికి ఇబ్బంది వస్తుందని ధర్మాసనం వ్యాఖ్యనించింది. అలాగే ప్రతి కేసులో సీబీఐ విచారణ సాధ్యం కాదని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. గతంలో కూడా తూర్పుగోదావరి జిల్లాలో ఓ లాయర్ కేసులో హైకోర్టు సీరియస్ కామెంట్స్ చేసింది.. ఆ జిల్లా ఎస్పీని కోర్టు పిలిపించింది

Related Posts