YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

జ‌మిలీ సంద‌డి...

జ‌మిలీ సంద‌డి...

కడ‌ప‌‌, సెప్టెంబ‌ర్ 15, 
వయసు అన్నది పాదరసం అంటాడు ఒక కవి. అది అలా మెరుపు వేగంతోఅలా జారిపోతూనే ఉంటుంది. దాన్ని పట్టుకోవాలని చూడడం కూడా కుదరని పని. అయితే కొన్ని ముఖ్యమైన పనులు మిగిలిపోయినపుడు వయసు గురించి చింత, చికాకు వస్తుంది. ఇపుడు అలాంటి బాధేదో చంద్రబాబును ఆవరించిందని ఆయన నిన్నటి తమ్ముడు, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అంటున్నారు. తనకు వయసు అయిపోతోందని తొందరగా ఎన్నికలు పెట్టేయమంటే ఏపీలో పెట్టేస్తారా? అని సెటైర్లు వేస్తున్నారు. జమిలి ఎన్నికలు అంటూ చంద్రబాబు కలవరింతల‌ వెనక వయసు బెంగతో పాటు, చిత్త చాంచల్యం కూడా ఉన్నాయని హాట్ కామెంట్స్ చేస్తున్నారు.
ఇక వైసీపీ మంత్రి బొత్స సత్యనారాయణ కూడా చంద్రబాబుతో చెడుగుడే ఆడుకున్నారు. మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన బాబుకు ఎన్నికలు ఎపుడు వస్తాయో కూడా తెలియదా అని గాలి తీస్తున్నారు. తాను అనుకున్నపుడ‌ల్లా ఎన్నికలు రావడానికి ఇది చంద్రబాబు రాసిన రాజ్యాంగం కాదని గుర్తుపెట్టుకోవాలని ఆయన అంటున్నారు. జగన్ అధికారంలో ఉంటే చంద్రబాబు ఓర్వలేకపోతున్నారు అని, అందుకే ఎన్నికలు అంటున్నారని కూడా బొత్స ఎద్దేవా చేశారు. ఇపుడు వచ్చిన 23 సీట్లు కూడా వద్దా బాబు, మళ్ళీ ఎన్నికలు అంటే అవి మూడో నాలుగో అయిపోతాయి జాగ్రత్త అంటూ బొత్స సెటైర్లు వేస్తున్నారు.బీజేపీలో ఏం జరిగినా బయటకు పొక్కదు, అంత సీక్రెట్ గా కధ ఉంటుంది. అందువల్ల జమిలి ఎన్నికలు అంటున్నా లేక కాదు అని అంటున్నా కూడా మోడీ మాస్టార్ కే లోగుట్టు తెలియాలి. అయితే బీజేపీలో కొత్త పూజారిగా ఉన్న ఎంపీ సీఎం రమేష్ జమిలి ఎన్నికలు జరుగుతాయని ఎవరు చెప్పారంటూ ఎదురు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల విషయంలో బీజేపీలో చర్చలు ఏవీ జరగలేదని, అదంతా ఉత్తిత్తి ప్రచారం అని కొట్టిపారేస్తున్నారు. సరే జమిలి ఎన్నికల విషయంలో ఎవరేమి అన్నారో ఏమో పక్కన పెడితే దాని మీద వస్తున్న ఊహాగానాలు పట్టుకుని చంద్రబాబు లాంటి తలపండిన సీనియర్ మాట్లాడడమే పరువు పోగొట్టుకునేలా ఉందని అంటున్నారు.తాను అయిదేళ్ల పాటు ప్రతిపక్షంలో ఉండేందుకు ఇష్టపడడం లేదని చంద్రబాబు తనకు తానుగా చెప్పేసుకున్నట్లుగా ఉందిట‌. అంతే కాదు, సీనియర్ మోస్ట్ లీడర్ గా ఉన్న చంద్రబాబు ప్రజాస్వామిక పధ్ధతులను గౌరవించకపోవడం మేధావుల్లో చర్చగా ఉంది. ప్రజలు ఓడించారు సరే, విపక్షంలో ఉంటూ ప్రభుత్వాన్ని నిలదీసి జనాలకు మేలు చేసేలా పనిచేద్దామన్న ఊసూ ధ్యాసా బాబుకు ఎందుకు లేవన్నదే సగటు జనాలకు వస్తున్న ప్రశ్నగా ఉంది. పైగా చంద్రబాబు అధికార వ్యామోహం, అత్యాశ కూడా బయటేసుకున్నారని అంటున్నారు. ఇక బాబు ఎంత కోరుకున్నా కూడా మోడీ తలచుకోకపోతే జమిలి ఎన్నికలు జరగవు, ఒకవేళ తలచుకున్నా 2023 వరకూ ఎన్నికలు ఉండవని ఢిల్లీ నుంచి వినిపిస్తున్న మాట. అంటే చంద్రబాబు ఎంత ఆయాస‌పడినా జమిలి ఎన్నికలు వచ్చినా కూడా నాలుగేళ్ల పాటు కచ్చితంగా ప్రతిపక్షంలో కాపురం చేయాల్సిందేనన్నమాట. ఇక వయసు తనకు భారం అని చంద్రబాబు భావిస్తే కుమారుడికో లేక మరో సమర్ధుడికో పార్టీ పగ్గాలు అప్పచెప్పి మోనిటరింగ్ చేసుకోవడమే బాబుకు ఉత్తమ మార్గమని విశ్లేషకులు సూచిస్తున్నారు. అవును కానీ తాను ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఒక్క రోజు కూడా అధికారం వదులుకోమని జమిలి ఎన్నికల గాసిప్స్ మీద నాడు చినబాబు అన్న మాటలు పెద‌బాబు మరిచారా?

Related Posts