అమరావతి సెప్టెంబర్ 15
అమరావతి భూ కుంభకోణంపై ఏసీబీ రంగంలోకి దిగింది.ఈ వ్యవహారం ఇప్పటికే ఇద్దరు అధికారులను అరెస్ట్ చేసిన ఏసీబీ...పూర్తి స్థాయిలో రంగంలోకి దిగింది.2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత నవ్యాంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. అప్పటికే ఆర్థిక లోటుతో కొట్టుమిట్టాడుతున్న ఏపీని తన చర్యలతో మరింత అప్పుల ఊబిలోకి నెడుతున్నారన్న విమర్శలను చంద్రబాబు పెడచెవిన పెట్టారని విపక్షాలు విమర్శలు గుప్పించాయి. పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ లో కొనసాగే అవకాశమున్నా కూడా....ఓటుకు నోటు కేసు నేపథ్యం లో హడావిడిగా ఏపీకి బాబు మకాం మార్చారని ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు చేశాయి. ఇక స్వార్థ రాజకీయాలకు తెర లేపుతూ.అమరావతి రాజధాని పేరిట 33 వేల ఎకరాల భూ కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపించాయి. అమరావతిలో టీడీపీ హయాంలో జరిగిన భూ కుంభకోణం ఇన్ సైడర్ ట్రేడింగ్ పై విచారణ జరపాలని నాటి ప్రతిపక్ష వైసీపీ డిమాండ్ చేసింది. ఫలితంగా తాజాగా అమరావతి భూముల వ్యవహారంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ పై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఇన్సైడ్ ట్రేడింగ్ పై సమగ్ర దర్యాప్తునకు ఏసీబీ రంగ సిద్ధం చేసుకుంటోంది. ఈ వ్యవహారం లో ఇప్పటికే ఇద్దరు అధికారులను అరెస్ట్ చేసిన ఏసీబీ...పూర్తి స్థాయిలో రంగంలోకి దిగింది. అమరావతిలో భూముల ఇన్ సైడర్ ట్రేడింగ్ పై సీబీఐ విచారణ కోరుతూ కేంద్రానికి వైసీపీ ప్రభుత్వం లేఖ రాసింది. ఈ వ్యవహారాన్ని సీబీఐకి అప్పగించేలా కేంద్రంపై పార్లమెంటులో ఒత్తిడి తేవాలని వైసీపీ ఎంపీలు పావులు కదుపుతున్నారు. అమరావతి భూ కుంభకోణం నేపథ్యంలో సీఐడీ ఇటీవల ఇద్దరిని అరెస్టు చేసింది. భూ రికార్డుల తారుమారు చేశారన్న ఆరోపణల నేపథ్యంలో తుళ్లూరు రిటైర్డ్ తహసీల్దార్ సుధీర్ బాబు దళితుల అసైన్డ్ భూములు అక్రమంగా కొన్న గుమ్మడి సురేష్ లను విచారణ జరుపుతున్నారు. సుధీర్ కు మాజీ సీఎం చంద్రబాబు తో సన్నిహిత సంబంధాలున్నాయన్న ఆరోపణలున్నాయి. దీంతో పాటు ఈ వ్యవహారం లో ఇద్దరు మాజీ మంత్రుల పేర్లు బలంగా వినిపిస్తున్నాయి.
అమరావతి ల్యాండ్ పూలింగ్లో అక్రమాలు తప్పుడు రికార్డుల సృష్టించిన నేపథ్యంలో సీఆర్డీఏ నెక్కల్లు డిప్యూటీ కలెక్టర్ కనికెళ్ల మాధురిని పోలీసులు గతంలోనే అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ వ్యవహారం పై ఏసీబీ రంగం లోకి దిగడం తో మరింత మంది ప్రముఖుల పేర్లు బయటకు వస్తాయన్న ప్రచారం జరగుతోంది.