విజయవాడ సెప్టెంబర్ 15,
ప్రకాశం బ్యారేజీకి వరద నీరు కొనసాగింది. గంట గంటకు వరద ప్రవాహం పెరుగుతుండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. బ్యారేజిలో ఇన్ ఫ్లో 3.7 లక్షల క్యూసెక్కులు,ఔట్ ఫ్లో 3.9లక్షల క్యూసెక్కులు. పులిచింతల నుంచి ప్రకాశం బ్యారేజీ వరద ప్రవాహం వస్తోంది. దాంతో 70 గేట్లను ఎత్తి నీటిని విడుదల చేసారు. ఈస్ట్రాన్, వెస్ట్రన్ కేనాళ్లకు 3013 క్యూసెక్కులు విడుదల చేసారు. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేసారు. అన్ని డివిజనల్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేసారు. మరోవైపు, కృష్ణా జిల్లాలో మున్నేరు, కట్టలేరు, వైరా వాగులు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి.