తిరుమల సెప్టెంబర్ 15,
తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం శాస్ర్తోక్తంగా నిర్వహించారు. తిరుమల శ్రీవారికి సెప్టెంబరు 19 నుండి 27వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు, అక్టోబరు 16 నుండి 24వ తేదీ వరకు నిర్వహించే నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించినట్లు టిటిడి ఈఓ అనిల్ కుమారగ సింగ్ఆల్ తెలిపారు. సాధారణంగా సంవత్సరంలో నాలుగు సార్లు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని నిర్వహించడం ఆనవాయితీ. ఉగాది, ఆణివార ఆస్థానం, వార్షిక బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు ఈఓ. ఇందులో బాగంగా ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, గడ్డ కర్పూరం, సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. కోవిడ్ - 19 నిబంధనల మేరకు ఆలయంలో ఈ కార్యక్రమాన్ని ఏకాంతంగా నిర్వహించినట్టు ఈఓ తెలిపారు. ఇక పాత సాంప్రదాయం ప్రకారం ఈసారి గరుడ సేవ నాడు, ఏ.పి ముఖ్యమంత్రి ప్రభుత్వం తరపున స్వామి వారికి పట్డు వస్ర్తాలు సమర్పిస్తారని ఈఓ తెలిపారు...