YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

మ్మెల్సీ సీటు కోసం బరిలో కోదండరాం,నాగేశ్వర్

మ్మెల్సీ సీటు కోసం బరిలో కోదండరాం,నాగేశ్వర్

హైదరాబాద్  సెప్టెంబ‌ర్ 15, 
తెలంగాణ రాష్ట్ర శాసనమండలికి రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికలు కత్తి మీద సాములా మారనున్నాయి.  ఎందుకంటే ఈ సారి బరిలో ఇద్దరు ఉద్దండులు ఉండబోతున్నారు.  ఎన్నికలలో ఇద్దరు ఆసక్తి కరమైన వ్యక్తుల ప్రవేశానికి టఫ్ ఫైట్ ఫైట్ నెలకొంది. కాగా ప్రస్తుతం కోదండరాం మరోసారి యాక్టివ్ కావాలని ఆలోచిస్తున్నాడు.కరీంనగర్-వరంగల్-ఖమ్మం  గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ నియోజకవర్గం నుంచి రాబోయే శాసనమండలి ఎన్నికలలో పోటీ చేయాలని కోదండరాం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు గ్రాడ్యుయేట్ల మద్దతు కోసం ప్రచారం చేయాలని నిర్ణయించారట.. అన్నీ సరిగ్గా జరిగితే త్వరలోనే నామినేషన్ దాఖలు చేస్తాడని సమాచారం. కోదండరాంకు బిజెపి  ప్రతిపక్షం కాంగ్రెస్ కూడా మద్దతు ఇచ్చే అవకాశాలున్నాయి.ఇక శాసనమండలిలోకి ప్రవేశించడానికి ఆసక్తి ఉన్న మరొక వ్యక్తి  ప్రొఫెసర్ నాగేశ్వర్. ఇప్పటికే ఒకసారి ఎమ్మెల్సీ అయిన నాగేశ్వర్ ఇప్పుడు మరోసారి బరిలో నిలవడానికి రెడీ అవుతున్నారు. తాజా సమాచారం ప్రకారం ఎంఎల్సిగా పదవీకాలం ముగిసిన తర్వాత తన అభిమాన జర్నలిజం రంగానికి తిరిగి వచ్చిన నాగేశ్వర్ మళ్లీ ఎన్నికలలో పోరాడాలని తీవ్రంగా ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.ఆసక్తికరమైన విషయం ఏమిటంటే నాగేశ్వర్ తత్వశాస్త్రం ద్వారా వామపక్షవాది అయినప్పటికీ తెలంగాణ రాష్ట్ర సమితి మద్దతుతో ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేయవచ్చని గులాబీ పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది..టిఆర్ఎస్ చీఫ్ మొదట్లో తన సొంత పార్టీ అభ్యర్థిని నిలబెట్టాలని అనుకున్నప్పటికీ  కోదండరాం మీద గెలవడం కష్టం కాబట్టి.. టిఆర్ఎస్ అభ్యర్థి ఎన్నికలలో ఓడిపోతే అది తనకు అవమానంగా ఉంటుందని డ్రాప్ అయినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ప్రొఫెసర్ నాగేశ్వర్ కు మద్దతు ఇవ్వాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. కాబట్టి అధికారిక అభ్యర్థిని నిలబెట్టడానికి బదులుగా టిఆర్ఎస్ పరోక్షంగా నాగేశ్వర్ కు మద్దతు ఇస్తుందని అంటున్నారు.  అయినప్పటికీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కోదండరాం పై పోటీ చేయడు. హైదరాబాద్ రంగా రెడ్డి మరియు మహబుబ్ నగర్ గ్రాడ్యుయేట్ల నియోజకవర్గం నుండి పోటీ చేస్తాడు. కాబట్టి అటు కోదండరాం ఇటు నాగేశ్వర్ గెలవడానికి సమస్యలు లేవని తెలుస్తోంది. కోదండరాంపై అభ్యర్థిని పెట్టకూడదని టీఆర్ఎస్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.

Related Posts