YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు తెలంగాణ

భూకబ్జా దారులనుండి రక్షణ కల్పించండి... ప్రభుత్వానికి ఓ ఆటో కార్మికుని కుటుంబం విజ్ఞప్తి

భూకబ్జా దారులనుండి రక్షణ కల్పించండి... ప్రభుత్వానికి ఓ ఆటో కార్మికుని కుటుంబం విజ్ఞప్తి

హైదరాబాద్ సెప్టెంబర్ 15 
టి స్థలం విషయం లో నమ్మించి మోసం చేసిన భూకబ్జా దారులనుండి రక్షణ కల్పించి,వారిపై చర్యలు తీసుకోవాలని మేడ్చల్ జిల్లా, కాప్రా మండలం, జవహార్ నగర్ గ్రామ పంచాయతీ బాలాజీనగర్ కు చెందిన  కె.బాబులాల్,అతని బార్య కమలాదేవి,అనిల్,సునితలు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసారు. హైదర్ గూడ లోని ఎన్ఎస్ఎస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో వారు మాట్లాడుతూ  బతుకు చెరువు కోసం రాజస్థాన్ నుండి 35 సంవత్సరముల క్రితం హైదరాబాద్ కు వచ్చి ఆటో నడుపుతూ చిరు వ్యాపారం చేస్తూ కుటుంబ సమేతంగా జీవిస్తున్నామని తెలిపారు.తాముఅమీద్ అనే కానిస్టేబుల్  దగ్గర సర్వే నెం.351, ప్లాట్ నెం.9 నందు 100 గంజములు, ప్లాన్ నెం.16 నందు 200 గజములు దేవేందర్ నగర్ కాలనీ , చెన్నాపూర్ , జవహార్ నగర్ గ్రామ పంచాయతీ , శామీర్ పేట మండలం, రంగా రెడ్డి జిల్లా నందు 2006 సం.లో ప్లాట్స్ కొనుగోలు చేసినట్లు తెలిపారు.. అట్టి ప్లాట్ ను హమీద్,సిద్దులు,కొండల ముదిరాజ్ నోటరి చేసారని,వారి పార్టన్నర్ అదినారాయణ అనే వ్యక్తి చనిపోగానే నాకు ప్లాటు అమ్మలేదు, నోటరీ సంతకం మాది కాదని మోసం చేసినట్లు తెలిపారు.ఈ నేపధ్యంలో నా ప్లాట్ కూడా లాక్కోవడానికి ప్రయత్నించి నానా ఇబ్బందులకు గురి చేసినాడు. అల్వాల్ పోలీసులకు పిర్యాదు చేయగా నా కేసు టేకప్ చేసిన పోలీసులు ఫింగర్ ప్రింట్స్ కు నేను కొనుగోలు చేసిన ప్లాట్ వేరే వారి ప్లాట్స్ అందరి జిరాక్స్ పంపించడం జరిగింది. రిపోర్టులో నాకు అమ్మి ప్లాటులో వారు పెట్టిన సంతకాలు నిజమైనవి అని తెలిసిన తరువాత నన్ను మోసం చేసిన వారందరినీ మెడ్చల్ కోర్టుకు పంపడం జరిగిందన్నారు. జైలుకు వెళ్ళే వ్యక్తులు బయటకు వచ్చి మమ్ములను బెదిరించి నాతో కేసు విత్ డ్రా చేయించి.నాకు 200 గజములు ఇచ్చి 100 గజములు వారికి కావాలని నన్ను బ్రతిమిలాడి భూమి లేని దగ్గర నకిలి నోటరీ డాక్యుమెంట్స్ 80 గజాల చొప్పున 2 ప్లాట్స్ నాకు ఇచ్చి మోసం చేసినారు. వారి విషపూరితమైన మాటలు నమ్మి నేను మోసపోయినాను. నాప్లాట్ నాకు ఇవ్వడానికి నన్ను 35 లక్షల ఇవ్వమని డిమాండ్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. ఇప్పటికి 13 సంవత్సరములు గడిచిన నన్ను వేదిస్తున్నారని ఆరోపించారు. దయచేసి ప్రభుత్వం స్పందించి నా ప్లాటు నాకు ఇప్పించి ఇలాంటి మోసగండ్లపై చర్య తీసుకోవాలని వారుకోరారు. వారందరి ద్వారా ఏ క్షణమైన నాకు నా కుటుంబానికి ప్రాణ హాని సంబవించవచ్చును మాకు ప్రాణ భిక్షపెత్తలని కోరారు.

Related Posts