YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

ప‌ర్యాట‌కుల‌ను ఆక‌ర్షించేలా తెలంగాణ‌లో టూరిజం

ప‌ర్యాట‌కుల‌ను ఆక‌ర్షించేలా తెలంగాణ‌లో టూరిజం

హైద్రాబాద్, సెప్టెంబర్ 15
ప‌్ర‌పంచ ప‌ర్యాట‌కుల‌ను ఆక‌ర్షించేలా తెలంగాణ‌లో టూరిజంను అభివృద్ధి చేస్తామ‌ని రాష్ర్ట ప‌ర్యాట‌క శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్ప‌ష్టం చేశారు. శాస‌న‌స‌భ‌లో ప్ర‌శ్నోత్తరాల సంద‌ర్భంగా నర్సంపేట నియోజకవర్గం పరిధిలో పర్యాటకాభివృద్ధిపై ఎమ్మెల్యే పెద్ది సుద‌ర్శ‌న్ రెడ్డి అడిగిన ప్ర‌శ్న‌కు మంత్రి స‌మాధానం ఇచ్చారు. ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలో టూరిజం అభివృద్ధికి ప్ర‌భుత్వం ప్ర‌త్యేక చ‌ర్య‌లు తీసుకుంటుంద‌ని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. జ‌ల‌వ‌న‌రులు ఉన్న ప్రాంతాలన్నింటినీ ప‌ర్యాట‌క ప్రాంతాలుగా తీర్చిదిద్దుతామ‌ని చెప్పారు. టూరిజం అభివృద్ధి చెందుతున్న స‌మ‌యంలో కొవిడ్ దెబ్బ‌తీసింద‌న్నారు. ఎకో టూరిజం, టెంపుల్ టూరిజం అభివృద్ధి చేస్తున్నామ‌ని చెప్పారు. పాకాల స‌ర‌స్సు వ‌ద్ద నిధులు ఖ‌ర్చు పెట్టి అభివృద్ధి చేశామ‌న్నారు. దీన్ని మ‌రింత అభివృద్ధి చేసేందుకు సిద్ధంగా ఉన్నామ‌ని స్ప‌ష్టం చేశారు. వ‌రంగ‌ల్‌లో కాళోజీ ఆడిటోరియాన్ని ఏర్పాటు చేశామ‌న్నారు. వ‌రంగ‌ల్ ప‌రిస‌ర ప్రాంతాల్లో మంచి టూరిజం స‌ర్క్యూట్‌ను ఏర్పాటు చేస్తున్నామ‌ని చెప్పారు. రాష్ర్టం ఏర్ప‌డిన త‌ర్వాత సీఎం కేసీఆర్ టూరిజంపై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ పెట్టార‌ని తెలిపారు. యాదాద్రిలో కూడా అద్భుత‌మైన టూరిజంను ఏర్పాటు చేసి అంద‌రినీ ఆక‌ర్షించేలా చేస్తామ‌న్నారు. న‌దులు, స‌ర‌స్సుల‌పై అద్భుత‌మైన దృశ్యాల‌ను ఏర్పాటు చేసి ప్ర‌పంచ ప‌ర్యాట‌కుల‌ను ఆక‌ర్షిస్తామ‌ని మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్ప‌ష్టం చేశారు

Related Posts