YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

మొఘల్ మ్యూజియం పేరు ఛత్రపతి శివాజీ మహరాజ్గా మార్పు

మొఘల్ మ్యూజియం పేరు ఛత్రపతి శివాజీ మహరాజ్గా మార్పు

లక్నో సెప్టెంబర్ 15 
యూపీలోని చారిత్రక పర్యాటక కేంద్రం ఆగ్రాలో నిర్మితమవుతున్న మొఘల్ మ్యూజియం పేరును ఛత్రపతి శివాజీ మహరాజ్ మ్యూజియంగా మారుస్తున్నట్టు సీఎం యోగి ఆదిత్యనాథ్ వెల్లడించారు. నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించిన ఆయన రాష్ట్రంలో బానిస మనస్తత్వాలకు చెందిన ఏ ఒక్క గుర్తును సూచికను ఉంచబోమని స్పష్టం చేశారు. మొఘలాయిలను మన హీరోలుగా ఎందుకు ఉండనిస్తామని శివాజీ మహరాజ్ మనకు హీరో అని చెప్పారు. కాగా తన మూడేళ్ల పాలనలో యోగి పలు ప్రాంతాల పేర్లను మార్చారన్న సంగతి తెలిసిందే. అలహాబాద్ పేరును ఆయన ప్రయాగ్ రాజ్ గా మార్చారు. 2015లో అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ ప్రాజెక్టును మొదలెట్టారు. తాజ్ మహల్ కు సమీపంలో ఆరు ఎకరాల స్థలంలో ఈ మ్యూజియంను ప్రభుత్వం నిర్మించడానికి పూనుకుంది. ఈ మ్యూజియంలో మొఘలుల సంస్కృతిని వారి విలువైన వస్తువులు చిత్రాలు కళాఖండాలు దుస్తులు పాత్రలు ఆయుధాలు తదితరాలను ప్రదర్శించాలన్నది ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది.భారతావనిని మొఘలులు 1526 నుంచి 1857 వరకూ పాలించిన సంగతి తెలిసిందే. వారి పాలనలోనే ఆగ్రా ఢిల్లీ తదితర ప్రాంతాల్లో ఎన్నో భారీ నిర్మాణాలు జరిగాయి. ఎర్ర కోట తాజ్ మహల్ వంటివి ఆ కోవలోనివే. అయితే తమ మూడు శతాబ్దాల పాలనలో మొఘలులు హిందువులు లక్ష్యంగా దాడులు చేశారని ఇబ్బందులు పెట్టారన్న ఆరోపణలపై చరిత్రకారులు విభిన్న వాదనలు చేస్తున్న సంగతి తెలిసిందే. భారతావనిని మొఘలులు 1526 నుంచి 1857 వరకూ పాలించిన సంగతి తెలిసిందే. వారి పాలనలోనే ఆగ్రా ఢిల్లీ తదితర ప్రాంతాల్లో ఎన్నో భారీ నిర్మాణాలు జరిగాయి. ఎర్ర కోట తాజ్ మహల్ వంటివి ఆ కోవలోనివే. అయితే తమ మూడు శతాబ్దాల పాలనలో మొఘలులు హిందువులు లక్ష్యంగా దాడులు చేశారని ఇబ్బందులు పెట్టారన్న ఆరోపణలపై చరిత్రకారులు విభిన్న వాదనలు చేస్తున్న సంగతి తెలిసిందే.

Related Posts