YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విదేశీయం

గోవాలో ప్రియుడితో నయన్

గోవాలో ప్రియుడితో నయన్

సౌతిండియా బ్యూటీ నయనతార సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. తన లవర్ విఘ్నేశ్ శివన్తో కలిసి నయన్ గోవా ట్రిప్ను ఎంజాయ్ చేస్తూ కొన్ని పిక్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ ఫోటోలో ఇప్పుడు దక్షిణాదిన ఫిల్మీ నెటిజెన్స్ కు టాపిక్ అయ్యాయి. విఘ్నేశ్ శివన్, నయనతార కొంతకాలంగా పీకల్లోతు ప్రేమలో మునిగి వున్నారు. రింగేజ్మెంట్ కూడా జరిగింది. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్టు ఈ ఇద్దరూ మీడియా ముందు పరోక్షంగా చెప్పారు. నయన్తో సన్నిహితంగా ఉన్న ఫొటోలను విఘ్నేశ్ తరచూ సోషల్మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు ఇద్దరూ ఫారిన్ ట్రిప్లకు వెళ్లి వచ్చారు. ఇప్పుడు నయన్-విఘ్నేష్ కలిసి దేశీ విహారయాత్రలు చేస్తున్నారు. అందులో భాగంగానే గోవాకు వెళ్లారు. విఘ్నేశ్ ఫ్యామిలీ మెంబర్లు కూడా ఈ ట్రిప్కు హాజరయ్యారు. ట్రిప్లో తను నయన్తో కలిసి దిగిన కొన్ని రొమాంటిక్ పిక్స్ ను విఘ్నేశ్ సోషల్ మీడియాకు షేర్ చేశారు. ట్విటర్లో ఈ ఫోటోలు బాగా ట్రెండ్ అవుతున్నాయి. హాలిడేస్ నుంచి ట్రిప్ ఫీలింగ్లోకి వచ్చామని ఫోటోలతో పాటు విఘ్నేశ్ ట్వీట్ చేశాడు. నయన్ శ్వేత వస్త్రాలు ధరించిన దేవతలా గౌనులో మెరిసిపోతోంది. ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ, పువ్వులు కోస్తూ కెమెరాకు పోజులిచ్చింది. తెలుపు ఎప్పుడూ అద్భుతంగానే ఉంటుంది.. అంటూ నయన్ ఫొటోలకు విఘ్నేశ్ క్యాప్షన్ ఇవ్వడం విశేషం. ఇదే సందర్భంగా తన తల్లి స్విమ్మింగ్ పూల్లో ఎంజాయ్ చేస్తున్న ఫొటోల్ని విఘ్నేశ్ షేర్ చేశాడు. అమ్మ ముఖంలో చిరునవ్వు నేరుగా మన హృదయాల్ని తాకుతుందంటూ సంతోషాన్ని ప్రకటించాడు.
 

Related Posts