YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

నారా లోకేష్ టార్గెట్...

నారా లోకేష్ టార్గెట్...

విజ‌య‌వాడ‌ సెప్టెంబ‌ర్ 16, 
రాజధాని అమరావతిలో జరిగిన అక్రమాలతో పాటు ఫైబర్ గ్రిడ్ లో చోటు చేసుకున్న అవినీతపైనా సీబీఐ విచారణ జరపాలని వైసీపీ పార్లమెంటు సమావేశాల్లో పట్టుబట్టనుంది. ఈ మేరకు పార్లమెంటు సమావేశాల్లో ఈ రెండు అంశాలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తేనున్నారు. అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ కు సంబంధించి మంత్రి వర్గ ఉప సంఘం కూడా వెలికి తీసిన నిజాలను పార్లమెంటు సాక్షిగా వైసీపీ బయటపెట్టనుంది. చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ చేసిన అవినీతిని జాతీయ స్థాయిలో ఎండగట్టేందుకు వైసీపీ సమాయత్తమవుతోంది.చంద్రబాబు పదే పదే చిన్న విషయాలపై కూడా సీబీఐ విచారణ కోరడం వైసీపీకి చికాకు తెప్పిస్తుంది. న్యాయస్థానాలను ఆశ్రయించి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతుండటం, పాలనను సక్రమంగా చేసుకోనివ్వకపోవడంపై వైసీపీ గరంగరంగా ఉంది. దీంతో చంద్రబాబు, లోకేష్ మెడలకు సీబీఐ కత్తి వేలాడేలా చేయాలన్నది వైసీపీ వ్యూహంగా కన్పిస్తుంది. ఒకసారి సీబీఐ విచారణ ప్రారంభమయితే చంద్రబాబు, లోకేష్ లు కూడా కోర్టులకు తిరగాల్సి ఉంటుంది.రాజధాని అమరావతి లో పెద్దయెత్తున భూ కుంభకోణం జరిగిందని వైసీపీ ఆరోపిస్తుంది. దీనిసై ఇప్పటికే మంత్రివర్గ ఉపసంఘం నివేదిక ఇచ్చింది. దాదాపు 4,069 ఎకరాలను చంద్రబాబు టీడీపీ నేతలతో పాటు తన బినామీలకు దోచిపెట్టినట్లు నిర్ధారణ అయింది. దీనిపై సీబీసీఐడీ విచారణకు ఆదేశించినా, సీబీఐ అయితేనే పక్కాగా ఉంటుందన్న ఆలోచనలో వైసీపీ ఉంది. దీనిపై ఎవరూ తప్పుపట్టలేరని, విపక్షాలు సయితం చంద్రబాబుకు అండగా ఉండవన్న అభిప్రాయంలో వైసీపీ ఉంది.ప్రధానంగా ఫైబర్ గ్రిడ్ లో వేమూరి హరికృష్ణకు 907 కోట్ల పనులను అప్పగించారు. ఇందులో కూడా పెద్దయెత్తున అవినీతి జరిగినట్లు గుర్తించారు. ఇందులో అప్పటి ఐటీ శాఖ మంత్రి లోకేష్ పాత్ర ఉందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. రాజధాని అమరావతి, ఫైబర్ గ్రిడ్ లలో అవినీతిని సీబీఐకి అప్పగిస్తే తండ్రీకొడుకులిద్దరూ కోర్టుల చుట్టూ తిరగాల్సివస్తుందని, అది పార్టీని మరింత మానసికంగా దెబ్బతీస్తుందన్న వ్యూహంలో వైసీపీ నేతలు ఉన్నారు. అందుకోసమే ఈ రెండు కేసులను సీబీఐకి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వంపై వత్తిడి తెచ్చే విధంగా పార్లమెంటులో వైసీపీ వ్యవహరించనుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Related Posts