YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

సోలిపేట సుజాత‌కు టిక్కెట్..?

సోలిపేట సుజాత‌కు టిక్కెట్..?

మెద‌క్, సెప్టెంబ‌ర్ 16, 
సోలిపేట రామలింగారెడ్డి మరణంతో దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనుంది. సభ్యుడి మరణంతో ఖాళీ అయిన స్థానాన్ని ఆ సభ్యుడి కుటుంబ సభ్యులతో భర్తీ చేయాలన్న భావనతో అక్కడ పోటీకి ప్రధాన పక్షాలు పెద్దగా శ్రద్థ చూపకపోవడమన్నది ఒక  ఆనవాయితీగా వస్తోంది.అయితే దుబ్బాక విషయంలో మాత్రం అందుకు భిన్నమైన వాతావరణం కనిపిస్తున్నది. ఇక్కడ జరగనున్న ఉప ఎన్నికలో అన్ని పార్టీలూ పోటీ చేస్తామని ప్రకటించాయి. తెరాస సోలిపేట రామలింగారెడ్డి సతీమణి సుజాతను బరిలోకి దింపనున్నట్లుగా ఇప్పటికే సూత్రప్రాయంగా నిర్ణయించింది.  ఆమె అభ్యర్థిత్వానికి సంబంధించి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అధికారిక ప్రకటనే తరువాయి అంటున్నారు.దుబ్బాకు స్థానాన్ని కైవసం చేసుకోవాలన్న పట్టుదలతో కాంగ్రెస్ ఇప్పటికే అక్కడ ప్రచారం ప్రారంభించింది. బీజేపీ కూడా ఎన్నికల బరిలో నిలవాలన్న నిర్ణయానికి వచ్చేసింది. ఆ పార్టీ అభ్యర్థిగా రఘునందన్‌ రావు పోటీపడే అవకాశాలు కనిపిస్తున్నాయి బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలతోపాటు దుబ్బాక ఉప ఎన్నిక షెడ్యూలు వెలువడుతుందన్న అంచనాల నేపథ్యంలో దుబ్బాక నియోజకవర్గంలో ఎన్నికల వేడి రాజుకుంది.సీఎం ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్‌, మంత్రి హరీశ్‌రావు ప్రాతినిథ్యం వహిస్తున్న సిద్దిపేట నియోజకవర్గాలకు దుబ్బాక పొరుగునే ఉండటంతో అధికారపార్టీ ఉపఎన్నికలో విజయం సునాయాసమన్న భరోసాతో ఉంది. మంత్రి హరీష్‌రావు వ్యక్తిగత శ్రద్ధ తీసుకుని మరీ దుబ్బాక నియోజకవర్గంలో మండలాలవారీగా విస్తృతంగా పర్యటించి కార్యకర్తలతో భేటీ అవుతూ. కల్యాణలక్ష్మి , షాదీముబారక్ చెక్కుల పంపిణీ, చెరువుల్లో చేపలు వదలడం వంటి అధికారిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ, పార్టీ కేడర్ లో ఉత్సాహాన్ని నింపుతున్నారు.
మరోవైపు ఇక్కడ పోటీకి సిద్ధపడుతున్న పక్షాలు తమ బలం కంటే...అధికార పక్షంపై ప్రజల్లో అసంతృప్తిపైనే ఎక్కువ ఆధారపడుతున్నట్లుగా కనిపిస్తున్నది. ముఖ్యంగా కాంగ్రెస్  అంతర్గత కుమ్ములాటల్లో సతమతమౌతూ ఎన్నికల వ్యూహరచనలో బాగా వెనుకబడి ఉంది. వరుస పరాజయాలతో ఆ పార్టీ క్యాడర్ కూడా నిరుత్సాహంగా ఉందన్నది పరిశీలకుల విశ్లేషణ. మరోవైపు బీజేపీ అభ్యర్థిని నిలబెట్టి ప్రచారం చేయడం వినా విజయంపై ధీమా వ్యక్తం చేయడంలేదు. ఈ పరిస్థితుల్లో దుబ్బాకలో తెరాసకు నిజమైన పోటీ ఉంటుందా అన్న సందేహాలు వ్యక్తమౌతున్నాయి.

Related Posts