YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

గవర్నర్ కోటాలో గోరేటి వెంకన్నకు ఎమ్మెల్సీ ?

గవర్నర్ కోటాలో గోరేటి వెంకన్నకు ఎమ్మెల్సీ ?

హైద్రాబాద్, సెప్టెంబ‌ర్ 16, 
ప్రముఖ వాగ్గేయ కారుడు గోరేటి వెంకన్న ఎమ్మెల్సీ బరిలో నిలవబోతున్నారు. గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ రేసులో తాజాగా ప్రజా గాయకుడు గోరటి వెంకన్న పేరు తెరపైకి వచ్చింది. ప్రస్తుతం భర్తీ చేయాల్సిన మూడు స్థానాల్లో ఒకదాని కోసం ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన గోరటి వెంకన్న పేరును టీఆర్‌ఎస్‌ అధిష్ఠానం సీరియ్‌సగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఆయన ప్రగతి భవన్‌కు వెళ్లి సీఎం కేసీఆర్‌ను కూడా కలిశారు. తన మాటలు, పాటలు, రాతలతో తొలి నుంచీ తెలంగాణ ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచారు వెంకన్న.అయినా ఎక్కడా కూడా.. సీఎం కేసీఆర్‌ విధానాలను బాహాటంగా వ్యతిరేకించిన దాఖలాలూ లేవు. ప్రగతి భవన్‌లో సీఎం ఆధ్వర్యంలో జరిగిన ఒకటి, రెండు సమావేశాల్లోనూ పాల్గొన్నారు. ఈ నేపథ్యంలోనే వెంకన్న పేరు బలంగా వినిపిస్తోంది. యన రాసిన 'పల్లె కన్నీరు పెడుతోందో' అనే పాట ఎంతో ప్రాచుర్యం పొందింది. అప్పటి ఉమ్మడి ఏపీ సీఎం వైఎస్ఆర్ పాద యాత్రలో ఈ పాట ఎంతో పాపులర్ అయ్యింది.మరోవైపు గవర్నర్‌ కోటాలో మూడు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. వాటిలో ఒకటి (సభావత్‌ రాములునాయక్‌) మార్చి 2న ఖాళీ కాగా, మరొకటి (నాయిని నర్సింహారెడ్డి) జూన్‌ 19న, ఇంకొకటి (కర్నె ప్రభాకర్‌) ఆగస్టు 17న ఖాళీ అయింది. వీటిలో ఒకటి కర్నె ప్రభాకర్‌కు పక్కా అనే అభిప్రాయంతో పార్టీ ముఖ్యులు ఉన్నారు. చివరి నిమిషంలో సమీకరణాలు మారితే తప్ప, సీనియర్‌ నేత నాయినిని నిరాశపర్చకపోవచ్చని చెబుతున్నారు. ఇక, మూడో స్థానం కోసం మొదటి నుంచీ మాజీ ఎంపీ సీతారాంనాయక్‌, కరీంనగర్‌ మాజీ మేయర్‌ రవీందర్‌సింగ్‌, సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్‌ పేర్లు వినిపిస్తున్నాయి.మరి ఎవరికి ఈ మూడు ఖాళీ స్థానాలు దక్కుతాయనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌గానే మారింది.

Related Posts