YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

గాలులతో మామిడి రైతుల కుదులు

 గాలులతో మామిడి రైతుల కుదులు

కరీంనగర్,

వరుసగా నాలుగు రోజుల నుంచి వస్తున్న ఈదురు కాలులు, వడగళ్లు ఇలా ఏదోరకంగా మామిడి రైతులు నష్టపోతున్నారు. ఈ ఏడాది పూత ఆలస్యమైనా చెట్లు విరగబూయడంతో ఆశలు చిగురించాయి. ఈ ఏడాది మామిడి దిగుబడులు భారీగా తగ్గనున్నాయి. వాతావరణంలో మార్పులతోపాటు మార్చి నుంచే ఉష్ణోగ్రత విపరీతంగా పెరిగింది. దీనికి తోడుగా బావులు, బోర్లలో భూగర్భజలాలు అడుగంటడంతో చెట్లకు సరిగా నీరందలేదు.మంచి దిగుబడులు వస్తాయని రైతులు సంతోషించారు. వారి ఆశలు అడియాసలే అయ్యాయి. వర్షాకాలంలో వేసిన వరి పంట దోమపోటుకు గురై పెట్టిన పెట్టుబడులు రాక అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు. జిల్లాలో కొందరు రైతులు సాంప్రదాయ పంటలను పక్కన పెట్టి మామిడి తోటలను సాగు చేస్తున్నారు. రైతుల ఆశలు ఈ ఏడాది పూత దశలోనే ఆవిరవుతున్నాయి. సిద్దిపేట జిల్లాలో సుమారు ఆరు వేల హెక్టార్లలో మామిడి తోటలు ఉన్నాయి. ప్రతి ఏటా డిసెంబరు నెలలోనే తోటలు పూతతో కళకళలాడేవి. ప్రస్తుతం జనవరి వచ్చినా మామిడి తోటలు వెలవెలబోతున్నాయి. ప్రధానంగా వర్షాభావ పరిస్థితులు రైతులకు శాపంగా మారాయి. ప్రకృతి కరుణించకపోవడం, వాతావరణ సమతౌల్యత లోపించడం, చలితీవ్రత అధికంగా ఉండటం తదితర ప్రతికూల పరిస్థితులు దిగుబడులపై ప్రభావం చూపనున్నాయిఅడుగంటిన భూగర్భజలాలు, పెరిగిన ఉష్ణోగ్రత, వాతావరణంలో వచ్చిన మార్పులు రైతులకు కడగళ్లను మిగిల్చాయి. ఫలితంగా మరోసారి చేదు ఫలాలే వచ్చాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో సాగునీటి సౌకర్యం లేని మెట్ట ప్రాంతాల్లో మామిడి తోటలు ఎక్కువగా ఉన్నాయి. ప్రధానంగా హుస్నాబాద్‌, అక్కన్నపేట, కోహెడ, మద్దూర్‌, నంగునూర్‌, సిద్దిపేట మండలాల్లో ఎక్కువగా ఉన్నాయి. వీటితో పాటు ఇతర మండలాల్లో కలిపి జిల్లా వ్యాప్తంగా 13,500 ఎకరాల్లో తోటలు ఉన్నాయి. ఏటా మామిడి తోటలకు ప్రకృతి వైపరీత్యాల వల్ల తీవ్ర నష్టం జరుగుతోంది. పూత ఆలస్యంగా రావడం, పిందె రాలడం, ఈదురు గాలులకు నేలరాలడం జరుగుతోంది. పెట్టుబడులు సైతం రాక కొందరు రైతులు తోటలను తొలగించారు.  కొందరు రైతులు ట్యాంకర్ల ద్వారా నీరందిస్తే మరికొందరు డ్రిప్‌ ద్వారా, ఇంకొందరు నేరుగా కాలువ ద్వారా అందించారు. అయినప్పటికీ 20 నుంచి 30 శాతం కూడా కాత నిలువలేదు. కాయలు బాగా కాస్తే ఎకరాకు 3 టన్నుల వరకు దిగుబడులు వస్తాయి. ఇప్పుడు టన్ను కూడా వచ్చే పరిస్థితి లేదని రైతులు చెబుతున్నారు. మరోవైపు మార్కెట్‌లో మామిడికి ధర మాత్రం బాగుంది. కిలో రూ.40 నుంచి రూ.50 పైనే పలుకుతోంది. ధర బాగా ఉండటం, వడగళ్లు పడే అవకాశం ఉండటంతో రైతులు ముందుగానే కాయలు తెంపుతున్నారు.

Related Posts