YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

లాక్ డౌన్ కు అందరూ సహకరించారు

లాక్ డౌన్ కు అందరూ సహకరించారు

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 16
కోవిడ్ నేప‌థ్యంలో దేశంలో విధించిన లాక్‌డౌన్‌ను ఏ రాష్ట్ర సీఎం కూడా వ్య‌తిరేకించ‌లేద‌ని బీజేపీ ఎంపీ డాక్ట‌ర్ విన‌య్ స‌హ‌స్ర‌బుద్దే తెలిపారు.  రాజ్య‌స‌భ‌లో ఇవాళ కోవిడ్‌పై చ‌ర్చ సంద‌ర్భంగా ఆయ‌న  మాట్లాడారు. లాక్‌డౌన్‌పై నిర్ణ‌యం తీసుకుంటున్న స‌మ‌యంలో.. అనేక సార్లు ఆయా రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌తో సంప్ర‌దింపులు జ‌రిపిన‌ట్లు ఆయ‌న చెప్పారు.  కోవిడ్‌19 మ‌హ‌మ్మారిపై కాంగ్రెస్ ఎంపీ  ఆనంద్‌శ‌ర్మ సూచ‌న‌లు ఇస్తార‌ని ఆశించామ‌ని, వారి ప్ర‌భుత్వం మూడు రాష్ట్రాల్లో అధికారంలో ఉంద‌న్నారు. ప్ర‌ధాని మోదీతో పాటు ఇత‌ర మంత్రుల‌తో ముఖ్య‌మంత్రులు 15 సార్లు స‌మావేశం  అయ్యార‌ని, అయితే ఏ ఒక్క సీఎం కూడా లాక్‌డౌన్‌ను వ్య‌తిరేకించ‌లేద‌న్నారు. ప్ర‌తిప‌క్షం త‌న ద్వంద్వ వైఖ‌రిని వీడాల‌న్నారు. ఎంపీ విన‌య్ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. ఇండియా గేటు  వ‌ద్ద దీపాలు వెలిగించే వారికి.. కోవిడ్ మ‌హ‌మ్మారిపై పోరాడుతున్న వారికి గౌర‌వంగా మాత్రం దీపాలు వెలిగించ‌లేక‌పోయిన‌ట్లు ఆయ‌న ఆరోపించారు.  కోవిడ్‌19 స‌మ‌యంలో కేంద్రం అనేక మెరుగైన  చ‌ర్య‌లు చేప‌ట్టింద‌న్నారు. ఫ్రంట్‌లైన్ వ‌ర్క‌ర్ల‌కు నివాళిగా దీపాలు వెలిగిస్తే, ప్ర‌తిప‌క్షాలు దాన్ని వ్య‌తిరేకించాయ‌న్నారు.  మ‌హారాష్ట్ర‌లో కావాల్సిన సంఖ్య‌లో డాక్ట‌ర్లు లేర‌ని ఎంపీ స‌హ‌స్ర‌బుద్దే ఆరోపించారు.  సైంటిఫిక్ ప‌ద్ధ‌తిలో అనేక రాష్ట్రాలు లాక్‌డౌన్ విధించాయ‌ని, మ‌హారాష్ట్ర‌లో మ‌హ‌మ్మారిని ఎదుర్కోవ‌డంలో రాష్ట్ర ప్ర‌భుత్వం విఫ‌ల‌మైంద‌ని ఎంపీ తెలిపారు. ముంబైలో ప‌రిస్థితి బాగాలేద‌ని ఎంపీ అన్నారు.  ఆ స‌మ‌యంలో ఎస్పీ ఎంపీ జ‌యా బ‌చ్చ‌న్ మాట్లాడుతూ.. త‌మ కుటుంబ‌స‌భ్యుల‌కు కూడా కోవిడ్ వ‌చ్చింద‌ని, ముంబైలో చికిత్స‌, శానిటైజేష‌న్ అద్భుతంగా ఉంద‌ని బ‌చ్చ‌న్ తెలిపారు. ఈ విష‌యాన్ని  రాజ‌కీయం చేయ‌వ‌ద్దు అని ఆమె అన్నారు.  

Related Posts