విజయవాడ, సెప్టెంబర్ 16
కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానన్న జగన్ ఇప్పుడు మోదీకి దాసోహమైంది కేసుల భయంతో కాదా అని ప్రశ్నించారు బండారు. 23 మంది ఎంపీలు, ఆరుగురు రాజ్యసభ్యులను చేతిలో ఉంచుకొని.. ఒక్కరోజు కూడా కేంద్రాన్ని ప్రశ్నించే ధైర్యం లేదా అని ప్రశ్న.గతంలో సొంత బాబాయి హత్య కేసు విచారణను సీబీఐకి అప్పగించడానికి వెనుకాడిన జగన్.. ఇప్పుడు ప్రతిదానికీ సీబీఐ విచారణ అనడం విడ్డూరంగా ఉందన్నారు మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి. అవినీతిపరులు సంగతి తేల్చండని బీజేపీ నేత సుప్రీంలో వేసిన పిటిషన్‌తో తనకు ముంపు ముంచుకొస్తుందని జగన్‌కు అర్థమైందన్నారు. అందుకే తనపై ఉన్న కేసుల విచారణ ప్రారంభమై, ప్రజలు తనను ఛీకొడతారని భావించే సిట్ విచారణ పేరుతో వారి దృష్టి మళ్లించడానికి ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.రాష్ట్రం అప్పులపాలు, కరోనా నియంత్రణలో విఫలం, వరద బాధితులను విస్మరించడం, అడ్డగోలుగా అవినీతి చేయడం తప్ప ముఖ్యమంత్రి అయ్యాక జగన్ ప్రజలకు చేసింది ఏమీ లేదన్నారు. టీడీపీపై, ఆపార్టీ అధినేతపై విమర్శలు చేస్తేనో, అవినీతి ఆరోపణలు చేస్తేనో ప్రజలు తనను నమ్ముతారని జగన్ భావించడం అజ్ఞానానికి నిదర్శనమన్నారు. జగన్ చేసిన అవినీతిని ఎర్రన్నాయుడు బయటపెట్టాడనే అచ్చెన్నాయుడిపై కక్ష కట్టారని.. తనకు శిక్షపడేలా వాదించారనే దమ్మాలపాటి శ్రీనివాస్‌పై బురదజల్లాలని చూస్తున్నారని మండిపడ్డారు.గతంలో కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానన్న జగన్ ఇప్పుడు మోదీకి దాసోహమైంది కేసుల భయంతో కాదా అని ప్రశ్నించారు బండారు. 23 మంది ఎంపీలు, ఆరుగురు రాజ్యసభ్యులను చేతిలో ఉంచుకొని.. ఒక్కరోజు కూడా కేంద్రాన్ని ప్రశ్నించే ధైర్యం జగన్ చేయలేకపోయారని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజలు అన్ని విషయాలను గమనిస్తున్నారని మర్చిపోకూడదన్నారు.