YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

వామ్మో..మాదాపుర్

వామ్మో..మాదాపుర్

మాదాపూర్ అంటే హడలెత్తుతున్నారు. గుట్టలబేగంపేట్‌లోని సైబర్‌హిల్స్ కాలనీలో రోడ్డుపై ఇష్టారాజ్యంగా చెత్త వేస్తున్నారుమాదాపూర్ లోని ఆ కాలనీకి వెళ్లాలంటే ముక్కు మూసుకునే దుస్థితి. శుభ్రతకు ఆమడ దూరంలో ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఇండ్లలోకి దుర్వాసన వెదజల్లుతుంది. ఈగలు, దోమలు విజృంభిస్తున్నాయి. ఎప్పటి చెత్తను అప్పుడు తొలగించకపోవడంతో రోడ్లపై చెత్త కుప్పలుతెప్పలుగా పేరుకుపోతుంది. పలుమార్లు శానిటేషన్ సిబ్బందికి ఫిర్యాదు చేసినా ఫలితం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి పేరుకుపోయిన చెత్తను ఎప్పటికప్పుడు తొలగించి తరచూ ఫాగింగ్ చేయాలని కోరుతున్నారు.అంతర్జాతీయ సదస్సులకు నిలయమైన హెచ్‌ఐసీసీకి కూతవేటు దూరంలో ఉన్న  దుర్వాసన వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం నగరాన్ని స్వచ్ఛ హైదరాబాద్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తుంటే జీహెచ్‌ఎంసీ అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. మాదాపూర్ డివిజన్‌కు చెందిన గుట్టలబేగంపేట్‌లోని సైబర్‌హిల్స్ కాలనీ లోపలివైపు ఉండటంతో అధికారులు పెద్దగా దృష్టి సారించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాలనీలో ఖాళీ స్థలాలు ఎక్కువగా ఉండటం, చెత్తడబ్బాలు అందుబాటులో లేకపోవడంతో చిరు వ్యాపారులు రాత్రి సమయంలో మిగిలిన కూరగాయలు, వ్యర్థాలను రోడ్డుపై ఎక్కడపడితే అక్కడ వేస్తున్నారు. దీంతో వ్యర్థాలు కుప్పలుతెప్పలుగా పేరుకుపోతున్నాయి. ఇక్కడ పందులు తిరిగి చెత్తను రోడ్డుపైకి తీసుకువస్తున్నాయి. సైబర్‌హిల్స్ రోడ్డులోకి ప్రవేశించగానే రోడ్డుకిరువైపులా మద్యం సీసాలు, దుర్వాసనతో కూడిన వ్యర్థాలు దర్శనమిస్తున్నాయి. దీనికి తోడు ఆ ప్రాంతంలో డంపింగ్ డబ్బాలు లేకపోవడంతో ఎక్కడపడితే అక్కడ చెత్తను వేస్తున్నారు. దీంతో అటుగా వచ్చే ప్రయాణికులు, పాదచారులు ముక్కులు మూసుకునే దుస్థితి ఎదురవుతుంది. 

Related Posts