YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

దుర్గమ్మ..మూడు సింహాలు ఎక్కడ...

దుర్గమ్మ..మూడు సింహాలు ఎక్కడ...

విజయవాడ, సెప్టెంబర్ 16
ఏపీ రాజకీయం విజయవాడ దుర్గమ్మ గుడి చుట్టూ తిరుగుతోంది. దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానానికి సంబంధించిన వెండి రథానికి ఉండాల్సిన మూడు సింహాలు మాయం అయ్యాయి.. రథానికి  ఒక్క సింహమే ఉందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మూడు సింహాలు చోరీ అయ్యాయని విమర్శలు వచ్చాయి. దీంతో ఒక్కసారిగా కలకలంరేపింది. దీనికి సంబంధించి కొన్ని ఫోటోలు కూడా సోషల్  మీడియాలో వైరల్ అయ్యాయి.సింహాలు మాయం అయ్యాయయనే ఆరోపణలతో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, ఆ పార్టీ నేతలు దుర్గమ్మ ఆలయాన్ని సందర్శించారు. దుర్గగుడి ఈవో  సురేశ్‌బాబుతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. వెండి రథానికి ఉండాల్సిన నాలుగు సింహాల్లో ఒక సింహం ప్రతిమ మాత్రమే ఉండటాన్ని గమనించామన్నారు వీర్రాజు.. ఉన్న ఒక సింహం ప్రతిమ  కాళ్ల దగ్గర పగుళ్లు ఉన్నాయంటున్నారు. నాలుగు సింహాల ప్రతిమలు ఉంటే రథానికే ఉండాలి, లేకపోతే నాలుగూ లాకరులో ఉండాలి. కానీ ఒక్కటి మాత్రమే రథానికి ఉండటంపై అనుమానాలు వ్యక్తం  చేశారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.ఇటు టీడీపీ కూడా ప్రభుత్వాన్ని టార్గెట్ చేసింది. దుర్గమ్మ వెండిరథానికి ఉండే నాలుగు సింహాల్లో మూడు చోరీ  చేశారని ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆరోపించారు. దీనికి సంబంధించిన ఫొటోలను విడుదల చేశారు. అధికారులు ఎవరిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారో చెప్పాలని.. సీఎం జగన్‌ అండ చూసుకుని
అరాచక శక్తులు పేట్రేగిపోతున్నాయని ఆరోపించారు.ప్రతిపక్షాల విమర్శలపై మంత్రి వెల్లంపల్లి స్పందించారు. రథానికి భద్రత కల్పించే చర్యల్లో భాగంగా అధికారులు కార్పెట్‌ని తెరిచి చూసే సమయంలో  సింహాలు కనిపించలేదని.. కొత్త ప్రభుత్వం వచ్చినప్పటి నుండి రథాన్ని ఉపయోగించలేదన్నారు. గత ప్రభుత్వం హయాంలో జరిగిందో ఇప్పుడు జరిగిందో విచారణలో తేలుతుందని.. ఘటనపై  దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు. సెక్యూరిటీ ఏజెన్సీకి దేవాలయం భద్రతా అప్పగించామని.. సెక్యూరిటీ ఏజెన్సీ భద్రతాలోపం అని తేలితే దానిపై చర్యలు  తీసుకుంటామన్నారు. ప్రతిపక్షాలు అనవసరంగా రాద్దాంతం చేస్తున్నాయని మండిపడ్డారు.ఇదిలా ఉంటే ఈవో సురేష్ బాబు స్పందించారు. సింహాలు మాయం కాలేదని.. రికార్డులు పరిశీలిస్తామన్నారు.  అంతర్వేది ఘటన జరిగింది కాబట్టి ఇలాంటి ఫేక్ న్యూస్‌లు వస్తున్నాయని.. రికార్డుల పరిశీలన కోసం మూడు రోజుల సమయం కావాలన్నారు. అయితే మొత్తం నాలుగు సింహాల్లో మూడే  లేకపోవడం.. ఒక్కటే ఉండటంపై విపక్షాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.  

Related Posts