న్యూ ఢిల్లీ సెప్టెంబర్ 16
బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో సెప్టెంబర్ 30వ తేదీన ప్రత్యేక సీబీఐ కోర్టు తీర్పును వెలువరించనున్నది. బీజేపీ సీనియర్ నేతలు ఎల్ కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి, కళ్యాణ్ సింగ్, ఉమా భారతిలు ఆ రోజున కోర్టుకు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేశారు. 1992, డిసెంబర్ 6వ తేదీన అయోధ్యలో కర సేవకులు 16వ శతాబ్ధానికి చెందిన మసీదును ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. అద్వానీతో పాటు ఇతరులపై నేరపూరి కుట్ర కింద ప్‌త్యేక సీబీఐ కోర్టు అభియోగాలు నమోదు చేసింది. అద్వానీతో పాటు ఇతరులపై కుట్రపూరిత ఆరోపణలను సీబీఐ కోర్టు 2001లో కొట్టివేసింది. దాన్ని 2010లో అలహాబాద్ కోర్టు సమర్థించింది. అయితే అలహాబాద్ కోర్టు తీర్పును సుప్రీం ఓవర్‌రూల్ చేసింది. 2017లో అద్వానీతో పాటు ఇతరులపై నమోదు అయిన నేరపూరిత అభియోగాలను రిస్టోర్ చేయాలని ఆర్టికల్ 142 ప్రకారం సుప్రీంకోర్టు ఆ కేసులో ఆదేశించింది.