YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

ఆన్ లైన్ ద్వారానే క్రికెట్ బెట్టింగ్ లు

ఆన్ లైన్ ద్వారానే క్రికెట్ బెట్టింగ్ లు

ఐపీఎల్ క్రికెట్ సీజన్ ప్రారంభమైంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో యువకులు, విద్యార్థులు ఎక్కువగా క్రికెట్‌పై ఆసక్తి కనబర్చుతున్నారు. కొన్నేళ్లుగా టీ20 మ్యాచ్‌లు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. వేసవి వచ్చిందంటే చాలు ఇండియన్ ప్రీమియం లీగ్  కోసం ఎంతో మంది ఎదురుచూస్తున్నారు. ప్రతి రోజు మ్యాచ్‌లు ప్రారంభమయ్యే సమయానికి టీవీల ముందు అతుక్కుపోతున్నారు. టాస్ ప్రారంభం నుంచి బాల్ టు బాల్, పరుగులు, వికెట్లు, కొంత మంది బ్యాట్స్‌మెన్‌లపై ఎన్ని పరుగులు చేస్తారో ఈ విధంగా బెట్టింగ్‌లు కడుతున్నారు.జిల్లాలో బెట్టింగ్ పలు రకాలుగా జరుగుతోంది. కొంత మంది గ్రూపులుగా ఏర్పడి బెట్టింగ్‌లకు పాల్పడుతున్నారు. మరి కొంత మంది బుకీల సాయంతో బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నారు. ముందుగా డబ్బులు పెట్టకుండా బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నారు. మ్యాచ్ అయిపోగానే వారి వారి బెట్టింగ్‌లలో ఎవరికీ ఎవరు ఎంత ఇవ్వాలో చివరికి లెక్క చూసుకుంటున్నారు. ఒకటికి రెండు, రెండుకు మూడు రెట్లు ఈ విధంగా బెట్టింగ్‌లు పెడుతున్నారు. తక్కువగా వందల నుంచి లక్షల వరకు బెట్టింగ్‌లు చేస్తున్నారు.క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడే వారు ఎక్కువగా ఆన్‌లైన్, సెల్‌ఫోన్‌ల ద్వారా తమ పని కానిచ్చేస్తున్నారు. ఎవరితో బెట్టింగ్ చేయదల్చుకున్నారో వారితో ఆన్‌లైన్, సెల్‌ఫోన్ ద్వారా బెట్టింగ్ చేస్తున్నారు. బెట్టింగ్‌కు పాల్పడే వారు ఇతరులకు అర్థం కాకుండా కోడ్ బాషలు ఉపయోగిస్తున్నారు. కోడ్‌ల ప్రకారం బెట్టింగ్‌లు పెట్టి వారు గెలిస్తే దానికి సంబంధించిన డబ్బును ఇవ్వడం జరుగుతుంది. జిల్లాలో ఐపీఎల్ బెట్టింగ్‌లు జోరుగా కొనసాగుతున్నాయి. కొంత మంది వారికి అనువైన రీతిలో బెట్టింగ్‌కు పాల్పడుతున్నారు. మరి కొంత మంది స్నేహితులు సమూహంగా ఏర్పడి బెట్టింగ్‌లు చేస్తున్నారు. ఇంకొంత మంది బుకీల సాయంతో బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నారు. ఈ బెట్టింగ్ వ్యవహారం జిల్లాలోని భైంసా, నిర్మల్, ఖానాపూర్ తదితర ప్రాంతాల్లో జరుగుతున్నట్లు సమాచారం.

Related Posts