YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

క‌రోనా ఉంది... మేము రాలేమ‌న్న ఎంపీలు

క‌రోనా ఉంది... మేము రాలేమ‌న్న ఎంపీలు

న్యూఢిల్లీ, సెప్టెంబ‌ర్ 17,
క‌రోనా మహమ్మారి వ్యాప్తి తీవ్రత అత్యంత ఆందోళనకర స్థాయిలో ఉన్న సమయంలో జరుగుతున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాలు  ఇవి. ఇంతటి ప్రత్యేక పరిస్థితుల్లో పార్లముంటు సమావేశాలు జరిగిన ఉదంతం ఇప్పటి వరకూ ఎన్నడూ లేదు. అనేక జాగ్రత్తల నడుమ జరుగుతున్న ఈ సమావేశాల కోసం సభ్యులందరూ కోవిడ్ పరీక్షలు చేయించుకున్నారు. అయినా ప్రతి రోజూ, ప్రతి అడుగూ భయంభయంగానే సాగుతోన్న పరిస్థితి ఉంది. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రారంభానికి ముందే ఎంపీలకందరకూ కరోనా పరీక్షలు నిర్వహించారు. ఆ పరీక్షల్లో లోక్ సభ సభ్యులు 17 మంది, రాజ్యసభ సభ్యులు ఎనిమిది మంది కరోనా నిర్ధారణ అయ్యింది. ఆ తరువాత కూడా ప్రతి రోజు సమావేశాలకు హాజరయ్యే ముందు కోవిడ్ పరిక్ష తప్పని సరి చేశారు. పార్లమెంటు సిబ్బందికి సైతం కరోనా సోకినట్లు తేలడంతో ఎంపీలలో ఆందోళన వ్యక్తమౌతున్నది. ఎన్నో జాగ్రత్తల నడుమ, ఉభయ సభలనూ ఒకే సారి కాకుండా సభ్యుల మధ్య సామాజిక దూరం ఉండేందుకు వీలుగా రెండు షిప్టులుగా నిర్వహిస్తున్నారు. విజిటర్స్ గ్యాలరీలో కూడా సభ్యులకు సీట్లు ఏర్పాటు చేసి సమావేశాలను నిర్వహిస్తున్నారు. సభ్యులంతా సభలో మాస్కులు ధరించే కూర్చున్నారు. సభ్యుల హాజరు కూడా మొబైల్ ద్వారానే తీసుకున్నారు. ఇక సభాకార్యక్రమాలకు సంబంధించిన అంశాలన్నీ డిజిటల్ రూపంలోనే ఇచ్చారు. ఒక విధంగా చెప్పాలంటే ఎలాంటి భౌతిక సంపర్కానికీ అవకాశం లేని విధంగా పార్లమెంటు వర్షాకాల సమావేశాలను నిర్వహిస్తున్నారు.  సభలో సభ్యులు ప్రసంగించేటప్పుడు సాధారణంగా నిలుచుని మాట్లాడతారు. అత్యంత ప్రత్యేక మైన సందర్భాలలో మాత్రమే సభ్యులు సభలో కూర్చుని ప్రసంగిస్తారు. అనారోగ్యం కారణంగా మాజీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కూర్చేనే బడ్జెట్ ప్రసంగం చేశారు. అటువంటి ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే కూర్చుని ప్రసంగించేందుకు అనుమతి ఉంటుంది. కానీ కోవిడ్ నేపథ్యంలో ఈ సారి సభలో సభ్యలు కూర్చేనే మాట్లాడే విధంగా నిబంధన రూపొందించారు.ప్రతి సభ్యుడి ముందూ పాలి కార్బన్ షీట్ ఏర్పాటు చేశారు. అయితే కరోనా భయం సభ్యులలో గూడుకట్టుకునే ఉందనడానికి 14 మంది రాజ్యసభ సభ్యులు ఈ సమావేశాలు పూర్తయ్యే వరకూ సెలవు మంజూరు చేయాల్సిందిగా దరఖాస్తు చేసుకోవడమే. అలా దరఖాస్తు చేసుకున్న వారిలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా ఉన్నారు. ఈ మేరకు వారు రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడికి దరఖాస్తు చేసుకున్నారు. ఈ పరిస్థితుల్లో సెలవు కావాలని కోరడాన్ని ఎవరూ అభ్యంతర పెట్టలేరు. సభ్యులే సభకు హాజరు కావడానికి సందేహిస్తున్న తరుణంలో పార్లమెంటు వర్షాకాల సమావేశాలు షెడ్యూల్ ప్రకారం జరుగుతాయా అన్న సందేహాలు సర్వత్రా వ్యక్తమౌతున్నాయి.
 

Related Posts