
భూమండలంలో ఎక్కడా లేని విధంగా ఏక పీఠం పై కొలువైన శ్రీ బాలా పార్వతీ సమేత జలధీశ్వర స్వామి దేవస్థానం ఘంటసాల - కృష్ణా జిల్లా
విజయవాడకు 60 కి.మీ.,కూచిపూడి నాట్యనిలయమైన కూచిపూడికి 13కి.మీ.దూరంలో వున్న ఘంటసాలగ్రామంశ్రీజలధీశ్వరాలయం ప్రాచీన ఆలయం. ఈ ఆలయ గోపురం తంజావూరిలోని బృహదీశ్వరాలయ గోపురం వలె ఉంటుంది. పార్వతీపరమేశ్వరులు కైలాసం లో ఒకరి ప్రక్కన ఒకరు కూర్చుంటారు.అలాగే ఘంటసాలలో శివపార్వతులు ఏకపీఠంపై ప్రక్కప్రక్కనే కూర్చుని దర్శనమిచ్చే ఆలయం ఘంటసాలలోని శ్రీబాలపార్వతీసమేత శ్రీజలధీశ్వరాలయం. ఈ పీఠాన్ని అగస్త్యమహర్షి స్వయంగా ప్రతిష్టించారు.ఈపీఠాన్ని జగత్ గురు ఆదిశంకరాచార్యులవారు ,కంచిపీఠాధిపతి తో సహా అనేక మంది పీఠాధిపతులు అర్చించినట్లు ఆధారాలు వున్నాయి.గర్భాలయ ద్వారానికి పైన శ్రీ ఆదిశంకరాచార్యలవారివిగ్రహం చెక్కబడి వుంటుంది.ద్వారపాలకులుగా ఎడమవైపు కాలభైరవుడు,కుడివైపున నరసింహస్వామిఉన్నారు.
గర్భాలయంలో శివపార్వతులు వేంచేసిన పానుపట్టం ఏకరాతిశిల .ఈపానుపట్టం క్రింద నాలుగు మూలల నాలుగు కాళ్ళు వున్నాయి.పానపట్టం నాలుగు మూలల వున్న ఈ కాళ్ళపై వుంటుంది.భూమిని తాకదు.ఏదేవాలయం లో నైనా భూమి లోపల నుండి పానుపట్టం వుంటుంది ఇక్కడి జలధీశ్వరాలయంలో పానుపట్టం భూమిని తాకదు.ఒకేపీఠం పై శివలింగం ,అమ్మ పార్వతీదేవి వున్న ఆలయం జధీశ్వరాలయం.భువిలో ఎక్కడా కూడ ఒకే పీఠం పై శివలింగం ,అమ్మవారుఉన్న ఆలయం లేదు ఈ క్షేత్రంలో ఆదిదంపతులిద్దరూ ప్రక్కప్రక్కనే కూర్చుని మనల్ని ఆశీర్వదిస్తున్నారు.ఆదిదంపతులను అలా చూడగలగటం మన అదృష్టం.ఆదిదంపతులను ఒకేసారి చూడటానికి మన రెండు కళ్ళు చాలవు. .ఆ ఆదిదంపతులు మనకు సకలశుభాలను,సుఖాలను,సంపదలను,కీర్తిప్రతిష్టలను ప్రసాదిస్తారు.శివశక్తి ప్రతిరూపమైన మహామేరు శ్రీచక్రాన్ని కంచి పీఠాధిపతులు అమ్మవారి పాదముల వద్ద ఏర్పాటుచేసినారు.ఈ శ్రీచక్రానికి కామాక్షి దేవాలయంలోని శక్తిని ఆపాదించినారు.
ఈ దేవాలయంలో వుండే నందీశ్వరుడు నల్లరాతి తో చెక్కబడి నయనమనోహర సజీవ రూపంతో దర్శన మిస్తారు. నందీశ్వరుని లోపలి నరాలు కూడ కనిపించేంత అద్భుతంగా చెక్కారు.శివపార్వతుల నిరువురినీ చూస్తునట్లుగా వుంటాడు. దేవాలయ ప్రాంగళంలో శ్రీవిఘ్నేశ్వరస్వామి వారి దేవాలయం వుంది.
సతీసమేత నవగ్రహ మండపం – ఏక పీఠముపై వెలసిన శివపార్వతుల వలే నవగ్రహములకు చెందిన దేవతామూర్తులు కూడ సతీసమేతులై ఈ దేవాలయ ప్రాంగళంలోని నవగ్రహ మండపం లో వున్నారు.
ఆలయ ప్రాంగళంలో వల్లీ దేవసేన సమేత శ్రీసుబ్రమణ్యేశ్వర స్వామి వారి ఆలయము వుంది . ఈ ఆలయం వెనుక శ్రీనాగేంద్రస్వామి వారి మందిరం వుంది.
శ్రీజలధీశ్వరస్వామివారికి బాలపార్వతీదేవికి మాఘపౌర్ణమి నాడు జరిగే కళ్యాణం ఆనాటి అగస్త్యలు,లోపాముద్ర దంపతుల నుండి నేటివరకు ప్రతిసంవత్సరము జరుగుచున్నది.ఈకళ్యాణము చూడటానికి దేవతలు సూక్ష్మరూపంలో వస్తారనివిశ్వాసము.జలధీశ్వరుని కళ్యాణం దర్శించి అక్షింతలు తలమీద దరించిన వారికి శ్రీఘ్రంగా కళ్యాణం జరుగుతుందని చెబుతారు.
జలం జీవులకు ప్రాణాధారం సమస్త ప్రాణకోటినీ రక్షించేది జలమే.జలం నుంచి జలధీశ్వరునిగా పూజలందుకుంటున్న స్వామి .శ్రీబాలపార్వతీ సమేత శ్రీజలధీశ్వరస్వామి వారికి జలం అంటే ఇష్టం.దోసెడు జలంతో ఆయన్ని అభిషేకిస్తే చాలు తృప్తి పడి మన శరీరంలో వున్న వ్యాధులన్నింటిని ఆయన కడిగేస్తాడు.అభిషేకించిన నీరే తీర్ధమై,దివ్య ఔషధమైనది.శ్రీజలధీశ్వరస్వామి వారి అభిషేక తీర్ధం అత్యంత మహిమాన్వతమైనది.శ్రీజలధీశ్వరస్వామికి శ్రీజలధీశ్వరస్వామికి 3ప్రదక్షిణలు చేసిఅభిషేక తీర్ధాన్ని సేవిస్తే సంపూర్ణ ఆరోగ్యంలభిస్తుంది అన్నది చాల మంది అనుభవం. సతీదేవి ఆత్మాహుతి చేసుకున్న తరువాత పార్వతీదేవి హిమవంతుని కుమార్తెగా జన్మించి పరమశివుని కోసం ఘోరతపస్సు చేస్తుంది.ఆమె తపస్సుకు మెచ్చినశివుడు పార్వతీదేవిని పరిణయమాడాలని నిశ్చయించుకుంటాడు.పార్వతీపరమేశ్వరుల కళ్యాణం చూడటానికివసమస్త ప్రణకోటి ఉత్తరాపధానికి బయలుదేరుతుంది.జీవకోటి భారంతో ఉత్తరాపధం కృుంగి పోతున్నది.ఆ సమయంలో పరమేశ్వరుడు స్వయంగా అగస్త్యమహర్షిని పిలిచారు.తక్షణమే దక్షిణా పధానికి వెళ్ళి ఒక పవిత్ర ప్రదేశంలో శివపార్వతుల విగ్రహ ప్రతిష్ట జరిపి ఏకాగ్రతతో పూజలు జరిపితే తమ కళ్యాణ మహోత్సవ సందర్శన భాగ్యం కలుగుతుందని చెప్పారు.మహాతపస్సంపన్నుడైన అగస్త్యమహర్షి దక్షిణాపదానికి విచ్చేసి ఘంటసాలలో పవిత్ర పానుపట్టం మీద శివపార్వతులను ప్రతిష్టించి పూజాదికాలు నిర్నహించి శివపార్వతుల కళ్యాణ సందర్శనాభాగ్యాన్ని పొందారు.ఆనాటి నుండి దక్షిణ కైలాసంగా ఈక్షేత్రం ప్రసిద్ధి చెందింది.
హిందూ సాంప్రదాయాలు ఆచరిద్దాం-పాటిద్దాం
ఓం నమః శివాయ