YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

అది కుట్రల కేంద్రం

అది కుట్రల కేంద్రం

అమరావతి సెప్టెంబ‌ర్ 17, 
తమ అవినీతి నుంచి ప్రజలదృష్టి మరల్చడం తప్ప 15 నెలల్లో వైసీపీ ప్రజలకు చేసిందేంటి ? - తాడేపల్లిలో ఉన్నది వైసీపీ కేంద్ర కార్యాలయం కాదు, కుట్రలకు కేంద్రాలయమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కిమిడి కళా వెంకట్రావు  విమర్శించారు. గురువారం అయన ఒక పత్రికా ప్రకటన విడుదల చేసారు. వైసీపీ పాలనలో  జరిగిన అవినీతిపై విచారణ చేయించే దమ్ము ప్రభుత్వానికి ఉందా ?  ఊహాజనితముగా తెలుగు దేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులు పై తప్పుడు కేసులు బనాయించి ప్రజల సొమ్మును దుబారా చేయడం తప్ప ఈ 15 నెలల కాలంలో వైసీపీ ప్రభుత్వం  సాధించిందేంటని అయన ప్రశ్నించారు.  వైసీపీ ప్రభుత్వం తీసుకున్న ప్రజా వ్యతిరేక విధానాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు, వైసీపీ 15 నెలల పాలనలో జరిగిన అవినీతి  కప్పిపుచ్చుకునేందుకే వైసీపీ ప్రభుత్వం రోజుకో అంశాన్ని తెరపైకి తెచ్చి ప్రజల సొమ్మును, కాలాన్ని దుర్వినియోగం చేస్తోంది.  హవాలా వ్యవహారంలో వైసీపీ మంత్రి బాలినేని పేరు బయటకు వచ్చినప్పుడు అచ్చెన్నాయుడిపై అక్రమంగా తప్పుడు కేసు పెట్టారు.   ఇప్పుడు వై.ఎస్. కుటుంబంపై సిబిఐ విచారణను దృష్టి మళ్లించడానికి మరొక తప్పుడు కేసు పెట్టాలని చూస్తున్నారు.  జగన్ మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన నాటి నుండి ప్రజాస్వామిక వ్యవస్థలపై ప్రణాళికబద్ధమైన దాడులు జరుగుతున్నాయి.  రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి కుట్రకు తాడేపల్లే  ప్రధాన కేంద్రం.   తాడేపల్లి లో ఉన్నది వైసీపీ కేంద్ర కార్యాలయం కాదు, కుట్రలకు కేంద్రాలయం.   రాష్ట్రంలో జరుగుతున్న ఘటన లన్నీ ఇక్కడ స్క్రిప్టు ప్రకారమే జరుగుతున్నాయి.   ప్రారంభంలో పెట్టుబడిదారులను ఇబ్బందులకు గురిచేశారు.   తర్వాత గత ప్రభుత్వ పథకాలు రద్దు చేశారు.   ఎన్నికల కమిషన్ పై దాడి చేశారు.   ప్రతిపక్ష నాయకులపై తప్పుడు కేసులు పెట్టారు బెదిరించారు.   మీడియాపై దాడి చేశారు.   దళితులపై, మైనారిటీలపై దాడి చేశారు చివరకు పోన్ లను కూడా టాపింగ్ చేస్తున్నారు.   ఇసుక మాఫియా, మద్యం కుంభకోణాలు ఇలా  వైసీపీ అవినీతి గురించి ప్రజలకు.   తెలియకుండా చూసుకోవడం కోసం దళితులు, వైద్యులు, ప్రభుత్వ అధికారులు ఉపాధ్యాయులు, న్యాయాధికారులపై దాడులు చేస్తున్నారని అయన ఆరోపించారు.  3 రాజధానుల పట్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేకత నుంచి ప్రజల దృష్టి మల్లించేందుకు ఇప్పుడు ఇన్ సైడర్ ట్రెడింగ్ అంటున్నారు.   వైసీపీ ప్రభుత్వ 15 నెలల పాలనలోనే అనేక కుంభకోణాలు, మంత్రులు, ఎమ్మెల్యేల అవినీతి వెలుగులోకి వచ్చాయి.   వారిపై కేసులు ఎందుకు పెట్టలేదని అయన మండిపడ్డారు.

Related Posts