న్యూ ఢిల్లీ సెప్టెంబర్ 17
ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక రైళ్లను ప్రారంభించాలని వైఎస్ఆర్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. రాజ్యసభలో జీరో అవర్ సందర్భంగా ఎంపీ మాట్లాడారు. తాజాగా 80 ప్రత్యేక రైళ్లను ప్రారంభించారని, కానీ హైదరాబాద్-వైజాగ్, హైదరాబాద్-తిరుపతి మధ్య ఒక్క రైలును కూడా ప్రారంభించలేదని ఆయన అన్నారు. ఈ రెండు మార్గాల్లో ప్రత్యేక రైళ్లను నడపాలంటూ ఎంపీ విజయసాయిరెడ్డి కేంద్రాన్ని కోరారు. జీరో అవర్‌లో ఇతర రాష్ట్రాల ఎంపీలు కూడా తమ ఫిర్యాదులు విన్నపం చేశారు. పుదుచ్చరి ఎంపీ గోకుల కృష్ణన్ మాట్లాడుతూ.. మండల్ కమిషన్‌లో చేసిన సిఫారసులు కేవలం కాగితాలకు మాత్రమే పరిమితం అవుతున్నాయని, దీంతో దేశంలోని ఎస్సీ, ఎస్టీలు తమ రిజర్వేషన్ల విషయంలో అణిచివేతకు గురవుతున్నట్లు తెలిపారు. సైనికులకు శౌర్య పతకాలు ఇచ్చినట్లుగానే కరోనా యుద్ధంలో ప్రాణాలు అర్పించిన ఫ్రంట్‌లైన్ వర్కర్లకు కూడా అవార్డులు ఇవ్వాలంటూ బీజేపీ ఎంపీ డాక్టప్ డీపీ వాట్స్ కోరారు.