YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

దర్జాగా దవాఖానాలు

దర్జాగా దవాఖానాలు

జనగాం జిల్లా వ్యాప్తంగా క్లినిక్‌లు, నర్సింగ్‌హోంలు యదేఛ్చగా అక్రమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. దాదాపు ఎలాంటి అనుమతులు లేకుండా 80 కిపైగా దవాఖానలు నడుస్తున్నట్లు తెలుస్తోంది. కొన్ని మండలాలు, గ్రామాల్లో క్లినిక్‌లు నిర్వహిస్తున్న ఆర్‌ఎంపీలు జిల్లా కేంద్రంలోని దవాఖానలతో సంబంధాలు నెరుపుతూ మామూలు జబ్బులను సైతం పెద్ద వ్యాధిగా పరిగణిస్తూ రోగులను ఆయా దవాఖానాలకు పంపుతూ పెద్ద మొత్తంలో కమీషన్లు నొక్కేస్తున్నట్లు ఆరోపనలు వినిపిస్తున్నాయి. అరకొర వైద్యం, అలసత్వాన్ని వీడని సిబ్బంది, అందుబాటులో ఉండని మందులు... వీటన్నింటికీ చిరునామా మన ప్రభుత్వాసుపత్రులు. రాష్ట్రంలో దాదాపు ఎక్కువ శాతం వైద్యశాలల పరిస్థితి ఇదే. రోగం వచ్చి ఆసుపత్రికి వెళితే.. సిబ్బంది ఉండరు. ఉన్నా.. వైద్యుడు రాసిన మందు గోలీలు అక్కడ ఉండవు. ఇదేంటని అడిగితే బయట తెచ్చుకోండి.. ఇక్కడలేవు అంటూ సమాధానమే వస్తోంది. వేల రూపాయలు పోసి మెడికల్‌ దుకాణాల్లో కొనలేక రోగులు అవస్థలు పడుతున్నారు. ఉన్నతాధికారుల నిర్లక్ష్యం కారణంగానే వర్షాకాలంలో మందులను అందుబాటులో ఉంచాల్సిన టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ వాటిని సరిగా పంపిణీ చేయడం లేదనే ఆరోపణలున్నాయి.జిల్లా కేంద్రంలో కొన్ని దవాఖానల్లో అర్హత లేని వైద్యులే అధికంగా విధులు నిర్వహిస్తున్నట్లు ఆరోపణలున్నాయి.ఇందులో సగానికి పైగా మాత్రమే వైద్యారోగ్యశాఖ నిబంధనలకు మేరకు నిర్వహిస్తున్నట్లు సమాచారం. కొన్ని దవాఖానలు విషయానికొస్తే కనీస నిబంధనలు పాటించకుండా కొనసాగిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆయా దవాఖానలను నిర్వహిస్తున్న యాజమాన్యాలు తమ పలుకుబడిని ఉపయోగించుకుని నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. అంతేగాకుండా కొన్ని దవాఖానల్లో అర్హత లేని వైద్యులను నియమించుకుని రోగుల వద్ద నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు గుంజుతున్నారు.  లేని డిగ్రీలు తగిలించుకుని దర్జాగా దవాఖానను నిర్వహిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నట్లు తెలుస్తోంది. కొందరు ప్రభుత్వ వైద్యులు నిర్వహిస్తున్న దవాఖానలు రెసిడెంట్ డాక్టర్ లేకుండానే కొనసాగుతుండటం వివాదాలకు కారణమవుతున్నాయిఆస్పత్రులంటే ఆలయాలతో సమానం. అక్కడ విధులు నిర్వహించే వైద్యులను దేవుళ్లుగా కొలుస్తారు . కానీ ప్రస్తుతం ఆ పరిస్థితులకు భిన్నంగా కొన్ని వైద్యశాలలు కొనసాగుతున్నాయి. వైద్యాన్ని కేవలం వ్యాపారంగా చేసుకున్న కొన్ని యాజమాన్యాలు అర్హత లేని వైద్యులను నియమించుకుని ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. వైద్యశాఖ నిబంధనలు తుంగలో తొక్కిన మరికొందరు అనుమతులు లేకుండానే ఆస్పత్రులు ఏర్పాటు చేసుకుని దర్జాగా నిర్వహిస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని ఆస్పత్రుల్లో రెసిడెంట్ డాక్టర్ ఉండాల్సిన కనీస నిబంధనలు పాటించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఇలాంటి ఆస్పత్రులు, వైద్యులపై ఎప్పటికప్పుడు నిఘా పెట్టి చర్యలు తీసుకోవాల్సిన వైద్యారోగ్యశాఖ అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్న తీరు అనేక అనుమానాలకు తావిస్తోంది. 

Related Posts