YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

*_అధిక మాసం పురుషోత్తమ మాసం వ్రతం_*

*_అధిక మాసం  పురుషోత్తమ మాసం వ్రతం_*

హరే కృష్ణ
వేదశాస్త్రాల ప్రకారం ప్రతి రెండు , కొన్నిసార్లు మూడు సంవత్సరాలకు ఒకసారి ఈ పురుషోత్తమ మాసం(అధిక మాసం) వస్తుంది. సాధారణంగా ఈ మాసాన్ని మూఢ మాసంగా భావిస్తారు. కానీ కృష్ణ భక్తులు , ఈ (అధికమాసం) పురుషోత్తమ మాసాన్ని *"కార్తీక మాసంగా"* భావిస్తారు.
భగవంతుడు ఎంతో కరుణతో మనం కార్తీక మాసంలో ఏవైతే ఆధ్యాత్మిక కార్యకలాపాలు చెయ్యటం వల్ల వెయ్యిరెట్లు ఫలితం వస్తుందో , అంతే ఫలితాన్ని ఈ పురుషోత్తమ మాసంలో కూడా పొందే భాగ్యాన్ని , అవకాశాన్ని మనకి కల్పించాడు. ఈ వ్రతం బ్రాహ్మణులు , భక్తులు , యోగులు , అభక్తులు అందరూ పాటింపదగినదే.
పురుషోత్తమ మాసం (అధిక మాసం) 18 సెప్టెంబర్ 2020 వ తేదీన ప్రారంభమై    16 అక్టోబర్ 2020 వ తేదీన ముగియనుంది. ఇది వైష్ణవ దినదర్శిని నుండి మరియు ఇస్కాన్ జి. బి. సి వారి సూచనల ప్రకారం మీకు తెలపబడుతున్నది. మనం కార్తీక మాసంలో ఏవైతే ఆధ్యాత్మిక కార్యకలాపాలు చెయ్యటం వల్ల వెయ్యిరెట్లు ప్రయోజనాలు కలుగుతాయో , అంతే ప్రయోజనాలు ఈ పురుషోత్తమ మాసంలో కూడా పొందొచ్చు అని పద్మపురాణం చెప్తుంది.
ఈ పురుషోత్తమ మాస వ్రతం ఆచరించే భక్తులు ఈ క్రింది ఆధ్యాత్మిక కార్యకలాపాలు చేయవలసి ఉంటుంది. దయచేసి గమనించగలరు.
1. రోజు మీరు చేసే జపం కన్నా ఎక్కువ జపం చేయండి.( హరే కృష్ణ మహా మంత్రం 108 సార్లు జపిస్తే , ఒక మాలగా పరిగణింపబడుతుంది).(ఒకవేళ మీరు 16 మాలల జపం చేసేవారైతే 18 , 24 , 32 , 48 , 64 మాలలు చేయవచ్చు.
2. మీరు సంకల్పించిన మాలల సంఖ్యను *"బ్రహ్మ ముహూర్తం"* లోపే ముగించండి. (ఉదయం 7.00 గంటల లోపు).
3. నేల మీద నిద్రించండి. (కటిక నేల మీద కాదు).
4. కేశములు, గోర్లు కత్తిరించరాదు.
5. సూర్యోదయానికి ముందే నిద్రలేచి, స్నానమాచరించాలి.
6. మందిరంలో మంగళహారతిని దర్శించడానికి ప్రయత్నించండి. కుదరని పక్షంలో ఇంటివద్దనే శ్రీ శ్రీ రాధా కృష్ణులకు మంగళహారతి చేయడానికి ప్రయత్నించండి. తులసీ మహారాణిని పూజించండి.
7. పురుషోత్తమ మాసం చేసేవాళ్ళు , తప్పక బ్రహ్మచర్యం పాటించాలి.
8. " బ్రహ్మ సంహిత " వింటూ భగవంతుడికి (శ్రీ శ్రీ రాధా కృష్ణులకు) , రోజులో ఒక్కసారి గానీ , రెండుసార్లు గానీ ఆవు నేతితో దీపాన్నిఇవ్వండి.
9. రోజూ శ్రీకృష్ణుడి బాల్యలీలలను (దేవాదిదేవుడు శ్రీకృష్ణభగవానుడు), భగవద్గీత 15 నవ అధ్యాయం చదవాలి , బ్రహ్మ సంహిత చదవండి.
10. ప్రతి రోజు చోరాష్టకం, గోస్వామి అష్టకం , జగన్నాధాష్టకాలు పాడాలి.
11. రోజులో మూడు సార్లు అయినా మందిరం చుట్టూ పరిక్రమణ చేయండి. ఆరోగ్య రీత్యా కుదరని పక్ష్యంలో ఒక్క పరిక్రమణ అయినా చేయడానికి ప్రయత్నించండి.
12. వ్రతమాచరించే సమయంలో ఏదైనా పవిత్రధామాన్ని దర్శించండి మరియు రోజు పవిత్ర నదిలో స్నానమాచరించడానికి ప్రయత్నించండి.
13. మాంసభక్షణం , జూదం , మద్యం , ఉల్లి - వెల్లులి ఈ మాసం చేసేవాళ్ళు తప్పక త్యజించాలి.
14. రోజులో ఒక్క పూట మాత్రమే ప్రసాదం స్వీకరించాలి (భుజించాలి). మధ్యాహ్నం లేదా సాయంత్ర సమయాల్లో మాత్రమే భుజించాలి. (గమనిక _ ఒక్క పూట ప్రసాదం స్వీకరించటం(భోజనం) యొక్క ఉద్దేశం కేవలం భౌతికంగా కొంత (పనిని )సమయాన్ని మిగిల్చి , ఆ సమయాన్నిభగవంతుడితో(ఆధ్యాత్మికంగా) గడపటం కోసం మాత్రమే చెప్పబడుతుంది.) ఆరోగ్య రీత్యా కుదరనిచో రెండు పూటలా ప్రసాదం స్వీకరించవచ్చు.
15. నూటికి నూటి శాతం ఆవు నేతితోనే వండిన పదార్థాలను స్వీకరించాలి. ఆరోగ్య రీత్యా , ఆర్థికంగా వీలుపడని పక్షంలో వేరుశెనగ నూనెను మాత్రమే వాడటానికి ప్రయత్నించండి.
16. అరిటాకులలో ప్రసాదం స్వీకరించాలి.
17. మీకు సాధ్యమైన ధనాన్ని మందిరానికి విరాళంగా ఇవ్వండి.
18. రోజులో మీకు వీలుపడిన సమయంలో మందిరంలో సేవ చేయండి.
19. రాధాగోపీనాథ్ చిత్రపటాలకు కమల , గులాబీ పువ్వులు మరియు తులసి దళాలతో చేసిన మాలలను సమర్పించండి. రాధాగోపీనాథ్ ల యొక్క కీర్తనలు , గురువుల యొక్క కీర్తనలు , తులసి కీర్తనతో రోజూ సంతోషంగా గడపండి.
20. గోపూజ , గోప్రదక్షిణ తప్పనిసరిగా చేయాలి.
పైన తెలుపబడిన నియమాలు మరియు సూచనలు మీ యొక్క ఆరోగ్య రీత్యా , ఆర్ధిక పరిస్థితి రీత్యా ఎంపిక చేసుకొని , ఎంచుకున్న మీ యొక్క నియమాలను ఆ దేవాదిదేవుడైన శ్రీకృష్ణ భగవానుడి ముందు సంకల్పించుకొని , వ్రతం ఆచరించండి.
*ఈ వ్రతం చేయటం వల్ల కలిగే లాభాలు*
1. ఈ వ్రతం చేయటం వల్ల అన్ని రకాల పవిత్ర ధామాలు మీ యొక్క దేహంలో ఉపస్థితమవుతాయి.
2. పురుషోత్తమ మాసం శ్రీకృష్ణుడు తో సమానమైన మాసం...
3. కార్తీక మాసం శ్రీమతి రాధారాణి మాసము. పురుషోత్తమ మాసం *1000* కార్తీక వ్రతములతో సమానము
4. స్వయంగా శ్రీకృష్ణుడు పురుషోత్తమ మాసం విశిష్టత చెప్పినట్టుగా పద్మ పురాణంలో కలదు.
5. ఎవరైతే ఈ పురోషోత్తమ మాసం శ్రద్ద మరియు భక్తితో చేస్తారో వాళ్ళు మరణానంతరం శాశ్వత ధామమైన , గోలోక ధామాన్ని అనగా భగవంతుడిని తప్పక చేరుకుంటారు.
ఈ పురోషోత్తమ మాసాన్ని బాగా ఆనందంగా , ఉత్సాహంగా , ఎటువంటి అపరాధలు లేకుండా ఆచరించాలి అని , జగద్గురు శ్రీల ప్రభుపాదుల వారిని పూజించి ప్రారంభించండి. హరే కృష్ణ !

Related Posts