YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు దేశీయం విదేశీయం

సౌదీ అరేబియా జైళ్లలో 450 మంది

సౌదీ అరేబియా జైళ్లలో 450 మంది

దుబాయ్,సెప్టెంబ‌ర్ 18, 
సౌదీ అరేబియా లోని జెడ్డాలో 450 మంది భారతీయులు గత నాలుగు నెలలుగా జైలులో మగ్గుతూ ఉన్నారు. వీరిలో చాలా మంది తెలంగాణ, ఇతర రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారు. వీరు చేసినవి చాలా చాలా చిన్న తప్పులు.. అయినా కూడా జైలులో మగ్గుతూ ఉన్నారు. తమను కాపాడాలని రాష్ట్ర ప్రభుత్వాలని కోరుతూ ఉన్నారు.. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ తో మాట్లాడి తమను జైలు నుండి విడిపించాలని.. స్వస్థలాలకు చేరుకునేలా ఏర్పాట్లు చేయాలని వారు కోరుతూ ఉన్నారు. తమ గోడును వెల్లడిస్తూ మీడియాకు వీడియో క్లిప్ ను పంపారు.అక్కడ ఉన్న వాళ్లంతా వలస వెళ్లి పని చేసుకుంటూ ఉన్నవారు. చాలా చిన్న తప్పులు.. సిగ్నల్ ను దాటడం, కూరగాయలను, నీటిని అమ్ముతూ కనిపించడం, లాక్ డౌన్ నియమ నిబంధనలు తెలియకుండా ఉల్లంఘించిన కారణాల వలన వీరిని జైలులో పెట్టారు. పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఇండోనేషియా దేశాలకు చెందిన వలస కార్మికుల పరిస్థితి కూడా ఇలాగే ఉందని వారు వెల్లడించారు.
చేతుల్లో డబ్బులు లేక.. లాయర్ ను సంప్రదించలేక సౌదీ అరేబియా లోని జైళ్లలో మగ్గుతున్నారు చాలా మంది. ఆ తర్వాత పని ఇచ్చే వాళ్లు కూడా లేరని బాధపడుతూ ఉన్నారు. తమ ఇళ్లల్లో తామే కష్టపడే వాళ్ళమని ఇప్పుడు మాకు కూడా ఉపాధి లేదు.. ఇంట్లో వాళ్లకు డబ్బులు పంపలేకపోతున్నామని ఆవేదన వ్యకతం చేస్తున్నారు. పాకిస్థాన్, బంగ్లాదేశ్ కు చెందిన కొందరు విడుదలయ్యారని.. కానీ భారత్ కు చెందిన మమ్మల్ని మాత్రం విడుదల చేయడం లేదని తెలిపారు వలస కూలీలు. వలస కూలీలలో చాలా మంది తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, ఉత్తర ప్రదేశ్, వెస్ట్ బెంగాల్ కు చెందిన వారే ఎక్కువ ఉన్నారని కూలీలు తెలిపారు.భారత ప్రధాని నరేంద్ర మోదీ తమ బాధను పట్టించుకోవాలని.. సౌదీ అరేబియాకు చెందిన అధికారులతో మాట్లాడాలని వారు కోరారు. తమను స్వస్థలాలకు తీసుకుని వచ్చే ఏర్పాట్లను చేయాలని కోరారు

Related Posts