న్యూ ఢిల్లీ సెప్టెంబర్ 18
ఇప్పటికే కరోనా వైరస్ పుట్టిన దేశంగా చైనా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల నుంచి విమర్శలు ఎదుర్కొంటుండగా.. చైనాకు తాజాగా మరో కొత్త తలనొప్పి మొదలైంది. కరోనాను ఓ స్థాయిలో కంట్రోల్ చేశామని సంబరంలో ఉన్న చైనా కు ఇది మింగుడు పడడం లేదు. దీని ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందో తెలీక అల్లాడుతోంది. వాయువ్య చైనాలోని గన్షు ప్రావిన్స్ రాజధాని లాంగ్ఝౌలో అనేక వేల మంది బ్యాక్టీరియా వల్ల మాల్టా అనే వ్యాధి బారిన పడ్డారు. అనేకమందికి పాజిటివ్ వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. గతేడాది బయోఫార్మాస్యూటికల్ కంపెనీలో వాయువులు లీక్ కావడంతో ఈ కొత్త రకం వ్యాప్తి చెందిందని అధికారులు వెల్లడించారు. ఈ బ్యాక్టీరియా ఇప్పుడు చైనాను కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ ప్రాంతంలో 3245 మందికి బ్రూసెల్లోసిస్ అనే బ్యాక్టీరియా కారణంగా వ్యాధి సోకింది.వాయువ్య చైనాలోని గన్షు ప్రావిన్స్ రాజధాని లాంగ్ఝౌలో ఉన్న ఝోంగ్ము లాంగ్ఝౌ బయోలాజికల్ ఫార్మాస్యూటికల్ కంపెనీ నుంచి గతేడాది జూలై-ఆగస్టు మధ్య ఈ బ్యాక్టీరియా లీక్ అయిందని సమాచారం. ఇప్పటివరకు 3245మందికి ఈ బ్యాక్టీరియా సోక గా దీని ప్రభావం తో బ్యాక్టీరియా తలనొప్పి కండరాల నొప్పి జ్వరం అలసటతోపాటు దీర్ఘకాలికంగా ఆర్థరైటిస్ తదితర సమస్యలతో బాధ పడుతున్నారని అమెరికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తెలియజేసింది. బ్రూసెల్లోసిస్ బ్యాక్టీరియా మనిషి నుంచి మనిషికి సోకదు. బ్యాక్టీరియా ఉన్న ఆహార పదార్థాలు తినడం వల్ల ఇది వ్యాప్తి చెందుతుంది. మాల్టా వ్యాధి వల్ల ఇంత వరకు ఏ ఒక్కరూ చనిపోలేదని అక్కడి అధికారులు చెబుతున్నారు. నగరంలోని 2.9 మిలియన్ల జనాభా లో మొత్తం 21847 మంది ని అధికారులు పరీక్షించారు. పాజిటివ్ వచ్చిన వారికి తల నొప్పి కండరాల నొప్పి జ్వరం అలసటతో పాటు దీర్ఘ కాలిక సమస్యలు కూడా తలెత్తినట్లు అధికారులు చెబుతున్నారు.