YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

చిరంజీవీ ఆశ‌లు.. ప‌దిలం

చిరంజీవీ ఆశ‌లు.. ప‌దిలం

హైద్రాబాద్,  సెప్టెంబ‌ర్ 19, 
చిరంజీవి. సినిమాల్లో మెగాస్టార్. రాజకీయాల్లో మాత్రం విఫలం అయ్యారనే చెబుతారు విమర్శకులు. చిరంజీవి అభిమానులు దాన్ని తమ నేతకు రాజకీయాలు అంటే ఇష్టం లేదని చెప్పుకోవచ్చు కానీ ఆయన రాజకీయాల్లోకి వచ్చే ముందు చేసిన సినిమాల్లోని అనేక సీన్లు చూస్తే టార్గెట్ సీఎం సీటు అన్నది అర్ధమవుతుంది. అక్కడ సింహాసనం ఆ ఇంద్రుడిది అయితే ఇక్కడ నాదీ అంటూ ఇంద్ర సినిమాలో చిరంజీవి చెప్పిన డైలాగులు ముఖ్యమంత్రి పదవిని గురిపెట్టి చేసినవే అని ఎవరైనా అర్ధం చేసుకుంటారు. అటువంటి టార్గెట్ మిస్ ఫైర్ కావడం అంటే మెగాస్టార్ చిరంజీవిది విఫల రాజకీయమేనని విశ్లేషిస్తారు.ఇదిలా ఉండగా మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ తాజాగా చేసిన హాట్ కామెంట్స్ చిరంజీవి రాజకీయ భవిష్యత్తు గురించి కొత్త ఆలోచనలు కలుగచేస్తున్నాయి. సోము వీర్రాజు పక్కా మెగా ఫ్యామిలీ భక్తుడు అంటూ హర్షకుమార్ ఈ మధ్య కామెంట్స్ చేశారు. ఆయన చిరంజీవి కుటుంబానిని వీర భక్త హనుమాన్ అని కూడా పోల్చారు. చిరంజీవిని సీఎం చేయడం కోసమే సోము వీర్రాజు రాజకీయం చేస్తున్నారు అని కూడా అన్నారు. మత రాజకీయాలు, కుల రాజకీయాలు చేయడంతో సోము దిట్ట అనేశారు. ఆయనకు సొంత సామాజికవర్గం మీద మమకారం మెండు అని కూడా కామెంట్స్ చేశారు. బీజేపీ మతతత్వ పార్టీ అయితే జనసేన కుల రాజకీయాలు చేస్తోందని కూడా హర్ష కుమార్ విమర్శించారు.ఇక హర్ష కుమార్ చేసిన మిగిలిన కామెంట్స్ ని పక్కన పెడితే చిరంజీవి రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నారన్న సంకేతాన్ని ఆయన వినిపించారు. దానికి ఆధారం అన్నట్లుగా సోము వీర్రాజు బీజేపీ ప్రెసిడెంట్ అయ్యాక తొట్ట తొలుత‌ కలిసింది చిరంజీవినేనని ఇక్కడ గుర్తుంచుకోవాలి. అంతే కాదు, సోముకు ఆ పదవి రావడానికి కారణమైన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్ కూడా చిరంజీవిని రాజకీయాల్లోకి తెచ్చేందుకు అప్పట్లో పెద్ద ప్రయత్నం చేశారని అంటున్నారు. ఇక పవన్ అమెరికా టూర్ లో రాం మాధవ్ భేటీ వేసి జరిపిన చర్చల పర్యవసానమే పవన్ జనసేన బీజేపీతో పొత్తు పెట్టుకోవడం అన్న మాట కూడా ఉంది. ఇవన్నీ చూసుకున్నపుడు చిరంజీవి ఇప్పటికైతే తెర వెనక ఉన్నారు కానీ బీజేపీ కధ అంతా ఆయన చుట్టూనే తిప్పుతున్నారా అన్న డౌట్లు రాక మానవు.ఇక సినిమాలో ఎటూ క్లైమాక్స్ సీన్లో హీరో ఎంట్రీ ఉంటుంది. అది ధియేటర్లో బాక్సులు బద్దలయ్య రేంజిలో ఉంటుంది. ఇపుడు ఏపీ రాజకీయ వేదిక మీద కూడా చిరంజీవి అలాంటి పొలిటికల్ రీ ఎంట్రీ ఇస్తారా అన్న చర్చ మాత్రం జరుగుతోంది. ఏమీ లేకపోతే హర్ష కుమార్ లాంటి వారు ఇలాంటి ప్రకటనలు ఎందుకు చేస్తారన్నదీ ఉంది. అయినా చిరంజీవికి రాజకీయాల మీద ఆశ ఉంది అని కూడా అంటున్న వారు ఉన్నారు. ఆయన ఇపుడు తమ్ముడు పవన్ రాజకీయానికి మద్దతు ఇస్తున్నారు. బీజేపీ సోము వీర్రాజుని ఆశీర్వదిస్తున్నారు. మరి ఒకవేళ 2024 నాటికి బీజేపీ, జనసేన కూటమికే విజయావకాశాలు ఉంటే కచ్చితంగా చిరంజీవి రంగంలోకి దిగుతారు అన్నదే ఒక అంచనా. ఏపీ రాజకీయాల్లో బీజేపీ కొత్త ప్రయోగమే ఇలా చేస్తోందనుకోవాలి. మెగా కుటుంబం సినీ గ్లామర్ ని వాడుకుంటూనే, తన పొలిటికల్ గ్రామర్ ని అద్దుతూ పెద్ద కుర్చీనే టార్గెట్ చేస్తోంది. మరి ఏపీలో అంత స్పేస్ ఉందా. చూడాలి.

Related Posts