YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు దేశీయం

అల్ ఖైదా ఉగ్రసంస్థ గుట్టు రట్టు: తొమ్మిది మంది ఉగ్రవాదులను అరెస్ట్

అల్ ఖైదా ఉగ్రసంస్థ గుట్టు రట్టు: తొమ్మిది మంది ఉగ్రవాదులను అరెస్ట్

న్యూ ఢిల్లీ  సెప్టెంబర్ 19 
అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ అల్ ఖైదా కుట్ర భగ్నమైంది. దేశంలో అరాచకం సృష్టిద్దామనుకున్న ఉగ్రసంస్థ గుట్టును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) రట్టు చేసింది.అల్ ఖైదాతో సంబంధాలున్న ఉగ్రవాదులను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. పశ్చిమ బెంగాల్ లోని ముర్షిదాబాద్ కేరళ రాష్ట్రంలోని ఎర్నాకుళం నగరాల్లో ఎన్ఐఏ అధికారులు శనివారం ఆకస్మిక దాడులు చేశారు. అల్ ఖైదా ఉగ్రసంస్థతో సంబంధాలున్న తొమ్మిది మంది ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు.నిషేధిత అల్ ఖైదా ఉగ్రసంస్థకు చెందిన 9మంది ఉగ్రవాదులు ముర్షిదాబాద్ ఎర్నాకుళం కేంద్రాలుగా పనిచేస్తున్నారని ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. వీరిని అరెస్ట్ చేసి కీలక డాక్యుమెంట్లు డిజిటల్ డివైజులు జిహాది సాహిత్యం ఆయుధాలు కంట్రీమేడ్ తుపాకులు మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నామని ఎన్ఐఏ తెలిపింది. అరెస్ట్ అయిన అల్ ఖైదా ఉగ్రవాదులు పాకిస్తాన్ దేశానికి చెందిన అల్ ఖైదా ఉగ్రవాదుల సోషల్ మీడియా ద్వారా స్ఫూర్తి పొందారని ఎన్ఐఏ అధికారులు తెలిపారు. ఢిల్లీ ఎన్సీఆర్ తోపాటు దేశంలోని పలు ప్రాంతాల్లో దాడులు చేసేందుకు అల్ ఖైదా ఉగ్రవాదులు కుట్ర పన్నారని దర్యాప్తులో తేలిందని ఎన్ఐఏ అధికారి వెల్లడించారు. ముర్సిదాబాద్లో ఆరుగురు ఎర్నాకుళంలో ముగ్గురు ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు.

Related Posts