చిత్తూరు సెప్టెంబర్ 19
పలమనేరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి అమరనాథ రెడ్డి శనివారం విలేకర్ల సమావేశం నిర్వహించారు.. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీ లోనే హిందూ దేవాలయాలపై దాడులు మతపరంగా ఒక విధమైన ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి నెలకొంది. గతంలో ఇలాంటి పరిస్థితి మేము ఎన్నడూ చూడలేదని అన్నారు. ఈ తక్కువ కాలంలో ఒక్కసారిగా ఎందుకు దేవాలయాలపై దాడులు జరుగుతున్న కార్యక్రమాలు వస్తున్నాయో మొదట అర్థం కాలేదు. కానీ లోతుగా ఆలోచిస్తే దీని వెనుక ఏదైనా ఒక అజెండా ఉందా... రహస్య ఎజెండా పెట్టుకుని ఈ దాడులను నిర్వహించడానికి ప్రభుత్వం ప్రోత్సహిస్తూ ఉందా.. ఈ విషయంలో ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే కఠినంగా ఉంటే ఇటువంటివి జరుగుతాయా అని ప్రశ్నించారు. ప్రభుత్వంలో ఉండే మంత్రులు, దేవాదాయ శాఖ మంత్రి ఈ విషయంలో అవహేళనగా, గేలి గా, తేలికగా మాట్లాడుతూ తప్పించుకోవడానికి మాట్లాడే మాటలు మాట్లాడితే ఈ పరిస్థితి ఎక్కడిదాకా తీసుకెళ్తోంది అని ప్రతి ఒక్కరూ ఆలోచించాలని అయన అన్నారు. ఈ దేశం అన్ని రకాల మతాలకు నిలయం. ఇక్కడ రకరకాల సంస్కృతులు, విభిన్న జాతులు, అన్ని మతాల కలయికే భారతదేశం.. అటువంటి చోట ఇలాంటి కార్యక్రమాలు జరగడానికి ఎందుకు ఆస్కారం ఉంది. ఇక పత్రికలలో తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ ఓ విషయాన్ని టూకీగా ప్రకటన చేశారని అయన అన్నారు.