కర్నూలు సెప్టెంబర్ 19
ఏపీలో బెంజ్ కారు వివాదం మరింత ముదురుతోంది. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు-మంత్రి జయరాం మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా అయ్యన్నపాత్రుడు చేసిన ఆరోపణలపై మంత్రి జయరాం స్పందిస్తూ కౌంటర్ ఇచ్చారు.టిడిపి నేతలకు పదవులు లేక అయ్యన్నపాత్రుడుతో సహా మరికొంత మంది నేతలకు మతిభ్రమిచ్చిందని,కార్మిక శాఖలో మందుల బిల్లు రావాలని ఏజెన్సీ అడిగితే విచారణకు అదేశించామని,విచారణలో గత ప్రభుత్వంలో పని చేసిన అచ్చెన్నాయుడు అవినీతికి పాల్పడ్డారని విచారణలో తేలిందని చెప్పారు.2014, 2018 సంవత్సరంలో అవినీతికి పాల్పడిన అచ్చెన్నాయుడును అరెస్టు చేశారని వివరించారు.2019లో కారును కొనుగోలు చేసిన ఫైనాన్స్ కట్టలేకపోవడంతో బెంజ్ కారును ఫైనాన్షియల్ వారు సీజ్ చేశారని చెప్పారు.బెంజ్ కారు విషయంలో అయ్యన్న పాత్రుడు అర్ధం లేని వ్యాఖ్యలు చేస్తున్నారని ఎద్దెవ చేశారు.