నిర్మల్, సెప్టెంబర్ 20
రాష్ర్ట దేవాదాయ, అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పేరిట ఫేస్‌బుక్‌లో ఫేక్ అకౌంట్ సృష్టించిన యువకుడిని నిర్మల్ పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా.. గాంధీనగర్‌కు చెందిన మొగిలి రాజేశ్ అనే యువకుడు.. ఫేస్‌బుక్‌లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పేరిట నకిలీ అకౌంట్ సృష్టించాడు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఆయన కుమారుడు గౌతం రెడ్డి కలిసి మోదీకి బర్త్‌డే విషెస్ చెప్తున్నట్లు ఫోటోలు సృష్టించి సోషల్ మీడియాలో వైరల్ చేశాడు. దీన్ని గమనించిన మంత్రి అనుచరులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో అన్వేష్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిర్మల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మొగిలి రాజేష్ పై ఐటీ యాక్టు ప్రకారం 505 (1), (బి), (2) & 67 సెక్షన్ల క్రింద కేసు నమోదు చేశారు. రాజేష్ కుమార్‌ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.